Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అరవ రాజకీయాల్లో 'సర్కార్‌' లొల్లి

అరవ రాజకీయాల్లో 'సర్కార్‌' లొల్లి

'సర్కార్‌' సినిమా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. తొలిరోజు సినిమాకి టాక్‌ మిక్స్‌డ్‌గా రావడం, సాయంత్రానికి 'సినిమా తేలిపోయింది' అంటూ రివ్యూలు తేల్చేయడం తెల్సిన విషయాలే. అయితే, అక్కడినుంచే కథ కొత్త మలుపు తిరిగింది. విజయ్‌కి తమిళనాట వున్న స్టార్‌డమ్‌ నేపథ్యంలో సినిమా రిజల్ట్‌ని మించి తొలిరోజు వసూళ్ళు వచ్చాయి. రెండో రోజుకే సినిమా 100 కోట్లు దాటిందంటూ ప్రకటనలు గుప్పించేశారు. ఆ తర్వాత సినిమాపై రాజకీయ రచ్చ షురూ అయ్యింది.

రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పరోక్షంగా అధికార పార్టీపై బురద జల్లారన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కార్యకర్తలు సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లపై దాడికి దిగారు. మరోపక్క, సినిమా దర్శకుడిపైనా, హీరోపైనా ప్రభుత్వం తరఫున వేధింపులు షురూ అయ్యాయి. ఓ వైపు కేసులు, ఇంకోవైపు రాజకీయ రచ్చ.. వెరసి 'సర్కార్‌' టీమ్‌ వెనక్కి తగ్గక తప్పలేదు. సినిమాలోని ఓ పాత్ర పేరుని (జయలలితను పోలి వున్న పాత్ర) మ్యూట్‌ చేసేందుకు సర్కార్‌ టీమ్‌ ముందుకొచ్చింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, సినిమాలో పలు సీన్స్‌ని సైతం తొలగించాలని 'సర్కార్‌' టీమ్‌ భావిస్తోందట. దర్శకుడు మురుగదాస్‌, హీరో విజయ్‌.. మరోపక్క నిర్మాణ సంస్థ కూడా సన్నివేశాల తొలగింపుపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అధికార అన్నాడీఎంకే పార్టీకి కూడా 'సర్కార్‌' టీమ్‌ తెలియజేయడంతో, వివాదం సద్దుమణిగినట్లేనని అంతా అనుకుంటున్నారు.

అయితే, రాజకీయ వివాదాల నేపథ్యంలో 'సర్కార్‌' టీమ్‌కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తుండడం గమనార్హం. ఇలా మద్దతిస్తున్నవారంతా అధికార అన్నాడీఎంకే పార్టీ వ్యతిరేకులే. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, డీఎంకే.. ఇలా 'సర్కార్‌' సినిమాకి మద్దతు బాగానే లభిస్తున్నా, అధికార పార్టీతో 'సర్కార్‌' టీమ్‌ ఎందుకు రాజీకి వెళుతుందో అర్థం కావడంలేదని విజయ్‌ అభిమానులు వాపోతున్నారు.

మరోపక్క, విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమయ్యిందన్న ప్రచారం తమిళనాడులో గట్టిగానే జోరందుకుంది.

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?