సుకుమార్ రంగస్థలం హిట్ అయిపోవడంతో తరువాత సినిమా మీద జనాల దృష్టిపడింది. ప్రస్తుతానికి మళ్లీ వందకోట్ల రేంజ్ సినిమా తీయాలంటే రెడీగా వున్న హీరో ఒక్క బన్నీనే.
మహేష్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ ఎవ్వరూ ఖాళీ లేరు. కానీ బన్నీతో అంత వీజీ కాదు. లైన్ చెప్పేసి సెట్ మీదకు వెళ్లడానికి, ఫస్ట్ హాఫ్ నెరేషన్ ఇచ్చేసి సినిమా స్టార్ట్ చేయడానికి కుదరదు.
తన దగ్గర రెండు మూడు కథలు వున్నాయని, ఏ హీరో సూట్ అయితే ఆ హీరో దగ్గరకు వెళ్లా అని సుకుమార్ చెప్పాడు కానీ, ఫస్ట్ ఆప్షన్ బన్నీనే. ఇప్పటికే బన్నీకి సుకుమార్ ఓ కథ 40నిమషాలు నెరేషన్ ఇచ్చాడట.
అయితే బన్నీ దానికి అంత సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. తనకు ఇలా పార్ట్ పార్ట్ లు నెరేషన్ వద్దని, ఫుల్ స్క్రిప్ట్ నేరేషన్ కావాలని బన్నీ కోరినట్లు తెలుస్తోంది.
మరి ఇప్పుడు రంగస్థలం హిట్ అయిన నేపథ్యంలో బన్నీ కాంప్రమైజ్ అవుతాడో? లేక బన్నీతో సినిమా కోసం సుకుమార్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడో చూడాలి.