మీడియాకు ఏం ఇవ్వాలో తెలిసిందట

యాంకర్ అనసూయ ఎప్పుడూ సంచలనమే. ఇప్పుడు ఆమె రంగమ్మత్తగా స్క్రీన్ మీద తనేంటో ప్రూవ్ చేసుకుంది. హీరోయిన్ సమంత అవుటాఫ్ పబ్లిసిటీ కావడంతో, ప్రీ రిలీజ్ అయినా, సక్సెస్ మీట్ అయినా అనసూయదే హవా…

యాంకర్ అనసూయ ఎప్పుడూ సంచలనమే. ఇప్పుడు ఆమె రంగమ్మత్తగా స్క్రీన్ మీద తనేంటో ప్రూవ్ చేసుకుంది. హీరోయిన్ సమంత అవుటాఫ్ పబ్లిసిటీ కావడంతో, ప్రీ రిలీజ్ అయినా, సక్సెస్ మీట్ అయినా అనసూయదే హవా అంతా.

ఫస్ట్ వీకెండ్ ముగియగానే జరిగిన సక్సెస్ మీట్ కు అనసూయ సూపర్ అట్రాక్టివ్ గా ముస్తాబై వచ్చింది. పేరు పేరునా ప్రతి టెక్నీషియన్, ప్రతి యాక్టర్ గురించి ప్రస్తావించి, విశ్లేషించి లెంగ్తీ స్పీచ్ ఇచ్చింది అనసూయ.

అప్పుడే మీడియా గురించి కూడా ప్రస్తావిస్తూ, తను ఎత్తినా, దించినా మీడియానే అనే అర్థం వచ్చేలా మాట్లాడింది. అయినా అసలు మీడియా తన మీద నెగిటివ్ ఫోకస్ పెట్టడానికి చాన్స్ ఇచ్చింది కూడా తనే అని అన్యాపదేశంగా చెప్పింది.

ఆ మధ్య ఓ కుర్రాడి చేతిలో పోన్ లాక్కుని పగలకొట్టిన ఇస్యూని ఆ విధంగా ఇండైరెక్ట్ గా ప్రస్తావించింది. నిజానికి ఆ ఇస్యూలో కూడా మీడియా అనసూయను టార్గెట్ చేసిన దాని కంటే, సోషల్ మీడియా చేసిన అటాక్ ఎక్కువ.

ఇప్పుడు లేటెస్ట్ గా రంగమ్మత్తగా అనసూయ బాగా చేసిందని మీడియా మెచ్చుకుంటోంది. ఈ రెండు విషయాలు ఇన్ డైరక్ట్ గా ప్రస్తావిస్తూ, మీడియాకు ఏం ఇవ్వాలో తెలిసిందని అనసూయ అనడం విశేషం. అంటే ఇకపై మీడియా తనను ప్రశంసించే పనులే ఎక్కువగా చేస్తుందన్న మాట యాంకర్ కమ్ నటి అనసూయ. బెస్టాఫ్ లక్.

రంగస్థలం థ్యాంక్స్ మీట్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి