చరణ్ క్లాసికల్ నేర్చుకున్నాడట

హీరో రామ్ చరణ్ కు గుర్రపు స్వారీ తెలుసు. బాగా నేర్చుకున్నాడు. సినిమాల్లో హీరో కావడం కోసం నటన నేర్చుకున్నాడు, ఫైట్లు నేర్చుకున్నాడు, డైలాగ్ డెలవరీ నేర్చుకున్నాడు. ఇదంతా తెలిసిందే. కానీ తెలియని సంగతి…

హీరో రామ్ చరణ్ కు గుర్రపు స్వారీ తెలుసు. బాగా నేర్చుకున్నాడు. సినిమాల్లో హీరో కావడం కోసం నటన నేర్చుకున్నాడు, ఫైట్లు నేర్చుకున్నాడు, డైలాగ్ డెలవరీ నేర్చుకున్నాడు. ఇదంతా తెలిసిందే. కానీ తెలియని సంగతి అంటూ దర్శకుడు సుకుమార్ ఓ విషయం బయటపెట్టారు.

రంగస్థలం సక్సెస్ మీట్ లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ఓ సీక్రెట్ రివీల్ చేసారు. హీరో రామ్ చరణ్ చాలా కాలం క్లాసికల్ సంగీతం నేర్చుకున్నారు అంటూ వెల్లడించారు. ఈ విషయం ఎవరికీ తెలియదని, ఇప్పుడు తాను బయటపెట్టేస్తున్నానని అన్నారు. రామ్ చరణ్ అందుకే పాటలు వినరని, సౌండ్ ట్రాక్ లు వింటారని సుకుమార్ మరో విషయం వెల్లడించారు.

ఇలా సౌండ్ ట్రాక్ లు వినడం చాలా రేర్. అందుకే రంగస్థలం రీరికార్డింగ్ చేసాక విని, దేవీ అద్భుతంగా చేసాడు కదా అని రామ్ చరణ్ వెంటనే చెప్పేసాడంటూ సుకుమార్ వెల్లడించారు. దేవీశ్రీ ప్రసాద్ తన ఆత్మ అని, తన ఆత్మకు రూపం వుంటే అది దేవీలా వుంటుందని సుకుమార్ అనడం విశేషం.

రంగస్థలం థ్యాంక్స్ మీట్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి