పోసాని, పృధ్వీ రాజకీయ చిత్రం

వైకాపా తరపున టాలీవుడ్ లో బలంగా మాట్లాడేవాళ్లు ఇద్దరే ఇద్దరు. రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, పృధ్వీ. ఇప్పుడు ఈ ఇద్దరు ఏకమై, ఓ మాంచి రసవత్తర రాజకీయ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. సెటైర్లు…

వైకాపా తరపున టాలీవుడ్ లో బలంగా మాట్లాడేవాళ్లు ఇద్దరే ఇద్దరు. రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, పృధ్వీ. ఇప్పుడు ఈ ఇద్దరు ఏకమై, ఓ మాంచి రసవత్తర రాజకీయ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. సెటైర్లు వేయడంలో పోసానిది అందెవేసిన చేయి. రాజావారి చేపల చెరువు సినిమా సంగతి తెలిసిందే.

అలాంటి పోసాని తయారు చేసిన వర్తమాన రాజకీయాల పొలిటికల్ సెటైర్ సినిమాలో పృధ్వీ, పోసాని కీలక పాత్రలు ధరిస్తున్నారు. ఈ సినిమా షూట్ నేడో రేపో ప్రారంభం కాబోతోంది. సినిమాకు పోసానినే దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ సినిమా సబ్జెక్ట్ వివరాలు గుంభనంగా వుంచారు. జగన్ మీద సినిమా అని ఒక టాక్ వుంది. కానీ జగన్ మీద సినిమా కాదని, పూర్తిగా చంద్రబాబు పాలనపై సెటైరికల్ సినిమా అని తెలుస్తోంది. చంద్రబాబు మాటలు, వరాలు, ఆచరణలో జరిగేవి ఇవన్నీ సినిమాలో వుంటాయని తెలుస్తోంది.

పవన్ ఒంటరిగా పోటీచేస్తే ఎవరికి లాభం?

ఇదేం సినీ అభిమానం.. ఏ రాతి యుగంలో ఉన్నాం?!