పోస్ట్ కోవిడ్ కు కావాల్సిన సినిమా ఏదీ అంటే పక్కా మాస్ సినిమానే. కుర్రాళ్లను, టైమ్ పాస్ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించాలి అంటే కాస్త మజా వుండాలి. జోష్ వుండాలి. ఈ లెక్కన చూస్తుంటే 'క్రేజీ అంకుల్స్' కు ఈ లక్షణాలు వున్నట్లు కనిపిస్తున్నాయి.
బోల్డ్ యాంకర్ శ్రీముఖి కీలకపాత్రలో నటించడం ఓ ప్లస్ పాయింట్ అయితే, సింగర్ మనో ఓ క్రేజీ అంకుల్ గా నటించడం మరో ప్లస్ పాయింట్. సినిమా నిండా పుష్కలంగా డబుల్ మీనింగ్ డైలాగులు బాగానే దొర్లినట్లు కనిపిస్తోంది.
పోసాని కృష్ణమురళిని అడ్డం పెట్టుకుని, మనో, రాజారవీందర్ లాంటి క్యారెక్టర్లతో బాగానే అడల్ట్ జోక్ లు పేల్చినట్లు కనిపిస్తోంది. శ్రీముఖి సంగతే ఇంకా తెలియడం లేదు. ఆమె ఏమేరకు కనిపించింది, వినిపించింది అన్నదాన్ని బట్టి వుంటుంది వ్యవహారం.
దర్శకుడు శ్రీవాస్ భాగస్వామిగా నిర్మించిన ఈ సినిమాకు కథ, మాటలు డార్లింగ్ స్వామి అందించారు.