ఇప్పటి దాకా రెండు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు అందించిన కళ్యాణ్ కృష్ణ ఒక్కసారిగా రూట్ మార్చి, మాస్ ఎంటర్ టైనర్ జోనర్ లోకి ఎంటర్ అయ్యారు. నేల టికెట్ అంటూ టైటిల్, రవితేజ హీరో.
ఈ రెండూ చాలు, సినిమా ఎవరిని టార్గెట్ చేస్తోందో చెప్పడానికి. అంటే తొలిసారి కళ్యాణ్ కృష్ణ, పక్కా నేల క్లాస్ ఆడియన్లను, లేదా బి సి సెంటర్ల ప్రేక్షకులను పట్టుకుని, థియేటర్లకు లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నమాట.
ఈ సినిమా ఫస్ట్ లుక్ అంటూ వదిలారు ఈరోజు. బోలెడు మంది సాదా సీదా జనాలు, మధ్యలో మాస్ మహారాజా. చేతికి సింగిల్ టీ. బ్యాక్ డ్రాప్ లో నేల టికెట్ కూపన్. అంతా బాగానే వుంది. బాగానే కన్వే చేసారు.
కానీ మాస్ మహారాజా లుక్స్ మాత్రం ఇంకా ‘టచ్ చేసి చూడు’’ ‘కిక్ 2’ టైపులోనే వున్నాయి. ఆ చూపులు, ఆ చిక్కిపోయిన ఫేస్ చూస్తుంటే ఒకప్పటి రవితేజ ఎలా వుండేవాడు. అంతెందుకు మొన్నటికి మొన్న రాజా ది గ్రేట్ లో ఎలా వున్నాడు? ఇప్పుడేంటి ఇలా అని అనుకునేలా వున్నాడు.
పైగా కళ్యాణ్ కృష్ణ అంటే కలర్ ఫుల్ చిత్రీకరణ, గ్లామరస్ లుక్స్ అలవాటు. గత రెండు సినిమాలు ఇవే సంగతి ప్రూవ్ చేసాయి. మరి నేలక్లాస్ అంటూ మాస్ ఎంటర్ టైనర్ చేయడం వరకు ఓకె. డీ గ్లామర్ అయితే మాత్రం కాస్త ఆలోచించాలేమో?