పోటీని తట్టుకున్న జాగ్వార్

నవ్విన నాపచేనే పండుతుందని సామెత. జాగ్వార్ సినిమా వస్తోంది అంటే జనాలకు కాస్త ఆసక్తి అయితే కలిగింది కానీ, అది హిట్ అవుతుందని, జనం చూస్తారని పెద్దగా అంచనాలు లేవు ఎందుకంటే మన ప్రేక్షకులకు…

నవ్విన నాపచేనే పండుతుందని సామెత. జాగ్వార్ సినిమా వస్తోంది అంటే జనాలకు కాస్త ఆసక్తి అయితే కలిగింది కానీ, అది హిట్ అవుతుందని, జనం చూస్తారని పెద్దగా అంచనాలు లేవు ఎందుకంటే మన ప్రేక్షకులకు హీరో అంటే కాస్త అందంగా వుండాలి. లేదా భయంకరమైన బ్యాకింగ్ వుండి, మెలమెల్లగా తమ ఫేస్ షేపులు మార్చుకుంటూ అందంగా తయారు కావాలి. 

జాగ్వార్ హీరో నిఖిల్ గౌడ మన జనాలకు నచ్చే అందం వున్నవాడు కాదు. ఇది వాస్తవం. అయితే మిగిలిన కన్నడ హీరోలతో పోల్చుకుంటే బెటర్. సినిమా విడుదలైన తరువాత కూడా పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. కానీ టీవీల్లో కుమ్మేసిన పబ్లిసిటీ మాత్రం పనికి వచ్చినట్లు కనిపిస్తోంది. 

సినిమాకు వున్న లావిష్ నెస్, పబ్లిసిటీతో జాగ్వార్ సినిమాకు కలిసి వచ్చినట్లున్నాయి. వెస్ట్ లో చాలా చోట్ల నిన్నటికి నిన్న ఇన్ని సినిమాల తాకిడిలో కూడా చాలా షోలు ఫుల్స్ కావడం చిత్రమే. ఎందుకంటే నిన్ననే విడుదలైన కొన్ని సినిమాలకు ఫుల్స్ లేకపోగా, ఓపెనింగ్స్ కూడా సరిగ్గా లేవు. మరి అంతా డబ్బు మహిమ అనుకోవాలా?