టీజర్ లో యుద్ధమే

బాలయ్య బాబు గౌతమీ పుత్ర శాతకర్ణి టీజర్ ముస్తాబయిపోయింది. దసరా విడుదలకు రెడీ అవుతోంది. టీజర్ తో సినిమా మీద జస్ట్ క్యూరియాసిటీ కలిగించి మాత్రమే వదలాలన్నది దర్శకుడు క్రిష్ అయిడియాగా తెలుస్తోంది. టీజర్…

బాలయ్య బాబు గౌతమీ పుత్ర శాతకర్ణి టీజర్ ముస్తాబయిపోయింది. దసరా విడుదలకు రెడీ అవుతోంది. టీజర్ తో సినిమా మీద జస్ట్ క్యూరియాసిటీ కలిగించి మాత్రమే వదలాలన్నది దర్శకుడు క్రిష్ అయిడియాగా తెలుస్తోంది. టీజర్ లో బాలయ్య పాత్ర పరిచయం మాత్రమే  వుంటుంది. చిన్న రెండు మూడు మాటల డైలాగ్ చివర్లో వుంటుంది. సమరం చేస్తావా? సామంతుడిగా వుంటావా? అనే టైపులో.

టీజర్ తరువాత ట్రయిలర్ తోనే సినిమా మీద బజ్ పెంచాలని, ఇప్పటి నుంచి హైప్ పెంచి, సినిమాల మీద అంచనాలు మరీ పెరిగిపోయేలా చేయకూడదని యూనిట్ ఆలోచన అని తెలుస్తోంది. అయినా కూడా టీజర్ క్వాలిటీ, ఆసక్తి విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకున్నారట. కంటెంట్ దగ్గర మాత్రం జస్ట్ హీరో ఇంట్రడక్షన్ అన్న వరకే వుంచాలి అన్నది దృష్టిలో పెట్టుకున్నారట.