పవర్ స్టార్ కాదు..స్టార్ పవర్

టాలీవుడ్ లో ఇప్పుడు అత్యంత తెలివైన వాడు ఎవరు అంటే ఆర్జీవీ నే. పావలా ఖర్చు పెట్టి పదిపైసలు ఎలా సంపాదించాలో తెలుసుకున్నారు. పావలా ఖర్చు లేకుండా ఫ్రీ పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో తెలుసుకున్నారు..…

టాలీవుడ్ లో ఇప్పుడు అత్యంత తెలివైన వాడు ఎవరు అంటే ఆర్జీవీ నే. పావలా ఖర్చు పెట్టి పదిపైసలు ఎలా సంపాదించాలో తెలుసుకున్నారు. పావలా ఖర్చు లేకుండా ఫ్రీ పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో తెలుసుకున్నారు.. ప్రతి ఇంటర్వ్యూకి ఎలా కొత్తగా మాట్లాడాలో ఆయనే ఛెబతున్నారు. ఈ క్వశ్చను హైలైట్ చేయండి. ఈ క్వశ్చను అడగండి అని ఆయనే డైరక్షన్లు ఇస్తున్నారు.

ఆరు లక్షలతో నగ్నం అనే ఇరవై నిమషాల ఫుటేజ్ (దీన్ని సినిమా అని అనలేం) తీసి రెండు వందల టికెట్ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ఫుటేజ్ లు మరో వంద వరకు ఏడాది లోపు వదలాలి అన్నది ఆయన టార్గెట్. వర్మను పదే పదే నమ్ముతూ చూసే వెర్రిజనాలు ఎంతోకొంత మంది వుంటారని ఆయన నమ్మకం.అదే ఆయనకు శ్రీరామ రక్ష.

వంద టికెట్ పెట్టినపుడు పది వేల మంది చూస్తే, రెండు వందలు టికెట్ పెట్టినపుడు అయిదువేల మంది చూస్తే చాలు, ఇలా ప్రేక్షకులు తగ్గుతున్నా, తన లాభాలకు లోటు వుండదన్నది ఆయన ప్లాన్. ఈ ప్లాన్ లో భాగంగానే, మరో ఏడాదిలో ఇలాంటి బుల్లి, బుజ్జి, సెన్సేషన్ సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే అమృత మీద ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పవర్ స్టార్ అనే సినిమా చేస్తా అంటూ చెప్పేసారు.

కానీ పవర్ స్టార్ అని తీయడం లేదు..స్టార్ పవర్ అని టైటిల్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ అనగానే నేరుగా పవన్ కళ్యాణ్ నే గుర్తుకు వస్తారు. అందుకే స్టార్ పవర్ అని పెట్టే ఆల్టర్ నేటివ్ ఆలోచన కూడా చేస్తున్నారని తెలుస్తోంది. కంటెంట్ ఏమీ వుండకుండా, కేవలం టైటిళ్లు, పబ్లిసిటీ, ఇంటర్వ్యూలతో ఆర్జీవీ ఎంతకాలం సంపాదించుకుంటూ వెళ్తారో చూడాలి.  

పీకే ఓడిపోయింది మాఊరి నుంచే

అల.. వైకుంఠపురంలో చూసి మైండ్ పోయింది