సినిమాల్లో తొడకొట్టడం అన్నది నందమూరి హీరోల మార్క్. బాలయ్య, హరికృష్ణ, ఎన్టీఆర్ ఇలా వీరంతా చాలా సినిమాల్లో తొడ కొట్టిన సందర్భాలు వున్నాయి. ఇంద్రసేనా రెడ్డి సినిమాలో మెగాస్టార్ కూడా తొడగొట్టే సీన్ చేసి, ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించారు.
ఈ తొడకొట్టడాల మీద దర్శకుడు భీమినేని తన సుడిగాడు సినిమాలో సెటైర్లు వేసారు కూడా. ఇంతకీ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తొడగొట్టే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది.
క్రిష్ డైరక్షన్ లో తయారవుతున్న 'హరి హర వీరమల్లు' సినిమా టీజర్ త్వరలో రాబోతోంది. టీజర్, టైటిల్ అనౌన్స్ మెంట్ ఒకటేసారి. ఈ ట్రయిలర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొడగోట్టే సీన్ వుంటుందని టాక్ వినిపిస్తోంది.
'వస్తున్నా..కాసుకోండి' అనే లాంటి డైలాగు కు కొనసాగింపుగా తొడగొట్టే సీన్ టీజిర్ లో వుంచే విషయమై డిస్కషన్లు సాగుతున్నట్లు బోగట్టా. హరి హర వీరమల్లు టీజిర్ కచ్చితంగా వైరల్ అవుతుందని యూనిట్ పక్కాగా నమ్ముతోంది.