బాబులిద్దరికీ సరైన కౌంటర్ పడినట్లేనా ?

విశాఖలో రాజకీయం వేడి రాజుకుంటోంది. అటూ ఇటూ మాటల తూటాలను పేల్చుకుంటున్నారు. విశాఖ ఎన్నికల ప్రచారానికి వచ్చిన లోకేష్ బాబు వైసీపీని తరిమికొట్టాలని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు అయితే విశాఖ వైసీపీని ఓడించాలని జనమే…

విశాఖలో రాజకీయం వేడి రాజుకుంటోంది. అటూ ఇటూ మాటల తూటాలను పేల్చుకుంటున్నారు. విశాఖ ఎన్నికల ప్రచారానికి వచ్చిన లోకేష్ బాబు వైసీపీని తరిమికొట్టాలని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు అయితే విశాఖ వైసీపీని ఓడించాలని జనమే డిసైడ్ అయిపోయారంటూ జోస్యం చెప్పేశారు.

మరి దీనికి వైసీపీ నుంచి కూడా రిటార్ట్ ఉంటుందిగా. అందుకే విజయసాయిరెడ్డి నోరు విప్పారు. అసలు విశాఖకు ఏ ముఖం పెట్టుకుని బాబులిద్దరూ వచ్చారంటూ భారీ కౌంటరే పేల్చారు. విశాఖ రాజధానిగా వద్దన్న వారికి ఇక్కడ ఏం పని అంటూ కూడా తగులుకున్నారు.

విశాఖను రాజధానిగా చేస్తామంటే మోకాలడ్డిన చంద్రబాబు, లోకేష్ లను ఉత్తరాంధ్రా ద్రోహులుగా తేల్చేశారు. వారిని విశాఖలో అడుగుపెట్టనీయవద్దని కూడా జనాలకు విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. 

విశాఖను భూకబ్జాల నగరంగా చంద్రబాబు మార్చితే తాము ప్రశాంత నగరంగా అందమైన సిటీగా తీర్చిదిద్దే చర్యలను చేపడుతున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి లోకేష్ ఆవేశానికి చంద్రబాబుకు వీరావేశానికి కూడా కలిపి మరీ వైసీపీ నుంచి గట్టి కౌంటరే పడింది అనుకోవాలేమో.