Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫీల్ గుడ్ విత్ మెసేజ్-శ్రీకారం

ఫీల్ గుడ్ విత్  మెసేజ్-శ్రీకారం

ఉమ్మడిగా చేసిన అనేక యుద్దాలే గెలిచినపుడు, వ్యవసాయం ఎందుకు లాభసాటి కాదు అన్న పాయింట్ కీలకంగా చేస్తున్న సినిమా. శర్వానంద్ తో కోత్త దర్శకుడు కిషోర్ చేస్తున్న శ్రీకారం. 14 రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చేవారం విడుదలవుతున్న నేపథ్యంలో ట్రయిలర్ విడుదల చేసారు.

సినిమాలో ఏం చూపించబోతున్నారు. ఏ ఆర్డర్ లో చూపించబోతున్నారు అన్న దానిపై క్లారిటీ ఇస్తూ ట్రయిలర్ కట్ చేసినట్లు కనిపిస్తోంది.

బాగా చదువుకున్న హీరో, అతనంటే ఇష్టపడి వెంటపడే అమ్మాయి, మంచి ఉద్యోగం, ప్రమోషన్, ఇవన్నీ వదలుకుని పల్లెటూరికి వచ్చి సామూహిక వ్యవసాయాన్ని రైతులకు నేర్పాలనే ప్రయత్నం, అదే సమయంలో పల్లెల్లో వుండే చిన్న చిన్న తగాయిదాలు, భావోద్వేగాలు వెరసి శ్రీకారం అన్నట్లు కట్ చేసారు ట్రయిలర్ ను. ఇప్పటికే బయటకు వచ్చి పెద్ద హిట్ అయిన 'వస్తానంటివో పోతానంటివో' సాంగ్ నే ట్రయిలర్ లో ప్లేస్ చేసారు. 

శ్రీకారం సినిమా ఎలా వుండబోతోందో చెప్పడం ద్వారా ప్రేక్షకులను ప్రిపేర్ చేయడమే ఉద్దేశం అయితే అది పక్కాగా నెరవేరినట్లే ఈ ట్రయిలర్ తో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?