ఇలాంటి రూమర్లు కొత్త కాదు. ఒక సినిమాలో కలిసి నటిస్తున్న హీరో,హీరోయిన్ల మధ్యన ఏదో ఉందనే రూమర్లు తరచూ వస్తూనే ఉంటాయి. సౌత్ లో కాస్త తక్కువ కానీ, బాలీవుడ్ లో అయితే.. ఒక్క సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ మధ్యన కూడా ఏదో ఉందనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. వారిద్దరూ డేటింగ్ అంటూ మొదలుపెట్టి, లవ్ అని, లివింగ్ రిలేషన్ షిప్ అని రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఎంతలా అంటే.. హీరోయిన్లు ఒక్కో సినిమా సమయంలో ఒక్కో బాయ్ ఫ్రెండ్ ను మార్చేస్తారనే ప్రచారాలుంటాయి బాలీవుడ్ లో.
మరి ఇదే తరహా ప్రచారమో లేక ఇద్దరూ సింగిల్ కావడం చేత.. వారి మధ్యన నిజంగానే ప్రేమ మొలకెత్తిందో కానీ.. ఆదిపురుష్ జంట ప్రభాస్- కృతీసనన్ లు డేటింగ్ లో ఉన్నారని, వీరిద్దరిదీ సీరియస్ రిలేషన్ షిప్ కూడా కావొచ్చనే ప్రచారం జరుగుతూ ఉంది. వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారని, వీరిద్దరూ బంధంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ లో.
ఆదిపురుష్ సినిమా ఇప్పుడిప్పుడే ప్రచార పర్వంలోకి వస్తోంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలో ఈ సినిమా విడుదల కానుంది. ఇలా ప్రచార పర్వాన్ని ఊపెక్కించడానికి ఈ సినిమా యూనిట్టే ఇలాంటి లీక్ ను ఇచ్చి ఉండవచ్చు కూడా! తమ సినిమాలో నటిస్తున్న హీరో, హీరోయిన్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం సదరు సినిమాకు వీలైనంత ఎక్కువ ప్రచారాన్ని ఇస్తుంది.
ఆ లెక్కతో ఈ రూమర్ పుట్టించి ఉండవచ్చు కూడా! అయితే అటు ప్రభాస్ సింగిల్ కావడం, ఇటు కృతికి కూడా ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ లేకపోవడంతో.. వీరిద్దరి మధ్యన బంధం అనే ప్రచారానికి ఊపు వస్తోంది. ఇది వరకూ కూడా ప్రభాస్ పై తన సహనటితో ప్రేమ అనే ప్రచారం ఉంది. అనుష్క, ప్రభాస్ లు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారాలు పాతవే. ఆ కథలు ఆ తర్వాత తేలికయ్యాయి. మరి కృతితో ప్రభాస్ అనే ప్రచారం ఎంత వరకూ వెళ్తుందో!