Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ సినిమాకు శంకర్ ఎహసాన్ లాయ్?

ప్రభాస్ సినిమాకు శంకర్ ఎహసాన్ లాయ్?

చాన్నాళ్ల తరవాత హీరో ప్రభాస్ చేయబోయే రెగ్యులర్ జోనర్ సినిమా కోసం భారీ ప్రీ ప్రొడక్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమాకు సుజిత్ దర్శకుడన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమా కోసం కాస్టింగ్, టెక్నికల్ టీమ్ వగైరా జనాల ఎంపికపై కసరత్తు సాగుతోంది. 

జనవరి నెలాఖరులోగా అగ్రిమెంట్లు ఫైనల్ చేసుకునే ప్రయత్నంలో వున్నారు. ఈ సినిమాగు సంగీత దర్శకుడిగా బాలీవుడ్ పర్సన్ ను ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. సినిమాను అన్ని భాషల్లో విడుదల చేస్తారు కాబట్టి, మాంచి బలమైన టీమ్ కోసం డిస్కషన్లు సాగుతున్నాయి. 

మ్యూజిక్ డైరక్టర్ గా శంకర్-ఎహసాన్-లాయ్ లను నియమించాలని అనుకుంటున్నారు. మరో ఒకటి రెండు పేర్లు కూడా డిస్కషన్ లో వున్నాయి, కానీ శంకర్ - ఎహసాన్ - లాయ్ ల వైపే ప్రభాస్ టీమ్ మొగ్గు చూపుతున్నట్లు వినికిడి. వీరు గతంలో తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకు సంగీతం అందించారు. మరి కొద్ది రోజుల్లో అన్నీ ఫైనల్ అవుతాయని యూనిట్ వర్గాల బోగట్టా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?