హీరోయిన్ పూజాహెగ్డేకు ఫుల్ డిమాండ్ ఇప్పుడు. బన్నీతో సినిమా చేస్తోంది. ప్రభాస్ తో సినిమా నిర్మాణంలో వుంది. బాలీవుడ్ సంగతి సరేసరి. ఇలాంటి టైమ్ లో హీరో అఖిల్ సరసన కూడా ఆమెనే ఫిక్స్ చేసారు. గీతాసంస్థ బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో నిర్మించే సినిమా అది.
అయితే నవంబర్ నుంచి కానీ డేట్ లు ఇవ్వలేనని పూజాహెగ్డే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే అలాచేస్తే, అఖిల్ సినిమా బాగా లేట్ అవుతుంది. అసలే ఆ సినిమాను ఏప్రియల్ 4న విడుదల చేయాలనే ఆలోచన వుంది గీతాసంస్థకు. అందుకే చిన్న అడ్జస్ట్ మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ డేట్ లు యువి నిర్మించే ప్రభాస్ సినిమా కోసం వున్నాయి. యువి, గీతా రెండూ అనుబంధం వున్న సంస్థలు. అందుకే అక్టోబర్ డేట్ లు గీతాసంస్థ తీసుకుని, నవంబర్ డేట్ లు ప్రభాస్ కు ఇచ్చే డిస్కషన్లు సాగుతున్నాయి. అయితే రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ నటించే జాన్ సినిమా ఓ నెల ఆలస్యం అవుతుందన్నమాట.