ప్రభాస్ తన కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ లేని ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. వంద కోట్ల బడ్జెట్ చిత్రం బాహుబలి కోసం. ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. అవి ప్రభాస్ శారీరకంగా, మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయట. దీనికి ముందే సన్నద్ధమైన ప్రభాస్.. శారీరక ధృఢత్వం పెంపొందించుకోవడానికి తీవ్రమైన కసరత్తులు చేశాడు. బరువు పెరిగాడు. కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీ విషయాల్లో శిక్షణ తీసుకొన్నాడు.
అయినా సెట్లో ప్రభాస్ పెర్‌ఫార్మెన్స్ రాజమౌళి అంచనాలను అందుకోలేకపోతోందట. ఈ విషయం గ్రహించిన రాజమౌళి.. ప్రభాస్‌పై మరింత ఒత్తిడి తీసుకొస్తున్నాడని సమాచారమ్. దాంతో ప్రభాస్ కూడా కాస్త నొచ్చుకొన్నాడట. అందుకే రెండు రోజులు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ప్రభాస్ విశ్రాంతి తీసుకొన్నట్టు సమాచారమ్. రాజమౌళి కేకాదు, ప్రభాస్‌కీ ఇది ప్రతిష్టాత్మక చిత్రమే. టాప్ ఛైర్ కి సమీపంలో ఉన్న ప్రభాస్ బాహుబలి హిట్టయితే… ఆ స్థానానికి మరింత దగ్గర కావచ్చు. పైగా వంద కోట్ల హీరోగా అరుదైన గుర్తింపు సాధించే అవకాశం ఉంది.
అందుకే ఈ సినిమాని ఛాలెంజ్‌గా తీసుకొన్నాడు. అయితే జక్కన్న అనవసర ఒత్తిడి తీసుకురావడంతో ప్రభాస్ లో టెన్షన్ మొదలైంది. దీని నుంచి ప్రభాస్ ఎలా బయటపడతాడో మరి…