శింబుతో ప్రేమలో ఉన్నానని హన్సిక పబ్లిగ్గా ప్రకటించగానే… ‘మంచోడినే ఎంచుకుంది’ అంటూ చాలా మంది చేసిన వెటకారపు కామెంట్స్ నిజమయ్యాయి. చాలా మందిని ప్రేమించిన శింబు ఎవరితోను స్థిరంగా కొన్నాళ్లున్న హిస్టరీ లేదు. నయనతారతో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని చెప్పుకుని తర్వాత ఆమెని బద్నాం చేసి పారేశాడు. ధైర్యవంతురాలు కాబట్టి అతడిచ్చిన స్ట్రోక్ తట్టుకుని నిలబడింది.
నయనతార ఎగ్జాంపుల్ కనిపిస్తున్నా కానీ హన్సిక అతని మాయలో పడింది. వరుసగా రెండు సినిమాలు కూడా చేసింది. పెళ్లి గురించి కూడా మాట్లాడేసిన వీరిద్దరూ ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు.
తమిళ మీడియా ప్రకారం శింబు, హన్సిక కనీసం ఒకరికి ఒకరు ఎదురు పడేందుకు కూడా ఇష్ట పడడం లేదట. దీంతో శింబుతో లవ్ అఫైర్స్ ఏ హీరోయిన్‌కీ కలిసి రావని మరోసారి తేలిపోయింది. టాప్‌లో ఉన్న హీరోయిన్లతోనే శింబు అఫైర్స్ ఇలా వార్తల వరకు వస్తుంటాయి. తర్వాత షరా మామూలుగా ముగుస్తుంటాయి. ఇకనైనా మిగతా వాళ్లు జాగ్రత్త పడితే మంచిది.