తమిళ హీరో ఆర్య తెలుగులో కూడా మార్కెట్ పెంచుకోవాలని చాలా కాలంగా చూస్తున్నాడు. కానీ తమిళంలో దక్కిన విజయాలు అతనికి తెలుగులో రావట్లేదు. ఈవారం అతను హీరోగా నటించిన ‘వర్ణ’ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి అనుష్క వల్ల బాగా క్రేజ్ వచ్చింది. అలాగే డైరెక్టర్ సెల్వ రాఘవన్ కూడా ఉండనే ఉన్నాడు.
తెలుగు, తమిళంలో ఈ చిత్రం పన్నెండు వందల థియేటర్లలో రిలీజ్ అవుతుందని ప్రకటించారు. రొటీన్‌కి భిన్నమైన చిత్రం కావడం, గ్రాఫిక్స్‌కి చాలా ప్రాధాన్యత ఉండడంతో ఈ చిత్రం తెలుగులో కూడా ఆడుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అనుష్కని అడ్డు పెట్టుకుని ఆర్య ఈసారి హిట్ కొట్టేద్దామని చూస్తున్నాడు.
ఈ చిత్రం హిట్ అయితే ఆర్యకి రెండు అనువాద చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఒకటి అజిత్‌తో నటించిన ‘ఆరంభం’ కాగా, మరోటి నయనతారతో చేసిన ‘రాజా రాణి’. ఈ రెండు చిత్రాలు తమిళంలో విజయం సాధించాయి. వర్ణ హిట్ అయితే వాటికి క్రేజ్ పెరగడంతో పాటు ఆర్యకి కూడా తాను కోరుకుంటోన్న తెలుగు మార్కెట్ దక్కుతుంది.