‘రుద్రమదేవి’ చిత్రంపై యాభై కోట్లకి పైగా పెట్టుబడి పెడుతూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న గుణశేఖర్ దీనిపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇంతకాలం నిర్మాతలకి సింహస్వప్నమని కామెంట్స్ ఎదుర్కొన్న గుణశేఖర్ ఇప్పుడు తనే నిర్మాత కష్టాలేంటో స్వయంగా తెలుసుకుంటున్నాడు. అయినా కానీ తన శైలికి తగ్గట్టే సినిమాని భారీగా తీస్తున్నాడు.
గుణశేఖర్ ఈ చిత్రం విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. అందుకే కేవలం అనుష్క మాత్రమే ఉంటే ఆకర్షణకి సరిపోదని భావించి, ఓ అతిథి పాత్రని మహేష్‌బాబుకి ఆఫర్ చేశాడు. గుణశేఖర్‌తో మూడు సినిమాలు చేసిన మహేష్ ఇప్పుడు అతడిని ఎంటర్‌టైన్ చేయడం లేదు. చివరకు అతిథి పాత్రకి కూడా కుదర్దని చెప్పేశాడు.
మహేష్ కాదనేయడంతో ఇప్పుడు ‘గోన గన్నారెడ్డి’ పాత్రని రవితేజతో చేయించాలని గుణశేఖర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే అరవై కోట్ల వరకు సాధించాల్సిందేనట. మరి గుణశేఖర్ ఈ చారిత్రిక చిత్రంతో అంతటి చారిత్రిక విజయాన్ని అందుకుంటాడో లేదో?