‘కందిరీగ’తో వచ్చిన విజయాన్ని నిలబెట్టుకోవడం రామ్‌కి చేతకాలేదు. అంతకు ముందు ‘రెడీ’తో హిట్ కొట్టినప్పుడు కూడా రామ్ వరుసపెట్టి రాంగ్ ప్రాజెక్ట్స్ చేసి ఫ్లాప్ అయ్యాడు. ‘కందిరీగ’ తర్వాత మరోసారి రామ్ ఫ్లాపుల బాట పట్టాడు. వెంకటేష్‌తో కలిసి చేసిన ‘మసాలా’ అయినా తనకి హిట్ ఇస్తుందని రామ్ ఆశ పడ్డాడు.
కానీ ఈ చిత్రం వసూళ్లు మొదటి వారంలోనే అంతంతమాత్రంగా ఉన్నాయి. నిర్మాతలకి, బయ్యర్లకి సాలిడ్‌గా నష్టాలొస్తాయనేది ట్రేడ్ రిపోర్ట్. ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ ఏదైనా ఉంటే వెంకటేషేనని విమర్శకులు తేల్చి పారేశారు. దాంతో రామ్‌కి మినిమమ్ క్రెడిట్ కూడా దక్కలేదు. ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలాతో ఫ్లాప్స్ హ్యాట్రిక్ కొట్టిన రామ్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు.
రెండేళ్ల క్రితం అతనితో పని చేయాలని చాలా మంది యువ దర్శకులు ప్లాన్ చేసుకుంటూ కనిపించేవారు. కానీ ఇప్పుడు రామ్‌తో సినిమా చేయడానికి యువ దర్శకులు సైతం ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఆడియన్స్ ఇతని సినిమాలపై ఆసక్తి చూపిస్తుండేవారు. ఇప్పుడు ఏమైందో పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు.