స్వంత బ్యానర్ లో రాధేశ్వామ్ సినిమా. నాగ్ అశ్విన్ తో భారీ సినిమా. ప్రశాంత్ నీల్ సినిమా. యజ్ రాజ్ ఫిల్మ్స్ లో వార్ 2 కూడా ప్రభాస్ దే. ఇవీ ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న సంగతులు. మరి ఇవన్నీ కలిసి ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ ను అమాంతం పెంచుతాయా? ప్రభాస్ ప్లానింగ్ సూపర్ యేనా? కాదా? అన్న చిన్నపాటి డిస్కషన్లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
ఓ విధంగా చూసుకుంటే ఇవన్నీ మంచి ప్రాజెక్టులు. భారీ సినిమాలు. కానీ ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే ఇవన్నీ ఎప్పటికి వస్తాయి? ఎలా వుంటాయి? అన్న సవాలక్ష సందేహాలు. ఎందుకంటే బాహుబలి తరువాత సాహో సినిమా రావడానికే ఏళ్లూ పూళ్లూ పట్టింది. 2019 నుంచి ఇప్పటి వరకు మరో సినిమా లేదు. మరో ఆర్నెలకు కూడా రాథేశ్వామ్ వస్తుందన్న నమ్మకాలు కనిపించడం లేదు.
అంటే సాహో వచ్చిన దాదాపు రెండేళ్లకు రాథేశ్వామ్ వస్తుంది. నాగ్ అశ్విన్ తన సినిమాకు రెండేళ్లు టైమ్ పడుతుందని క్లారిటీగా చెప్పినట్లు వార్తలు వినవస్తున్నాయి. అంటే అదే ముందు అనుకుంటే 2022 లేదా 2023 కు కానీ నాగ్ అశ్విన్ సినిమా రాదు. పోనీ ముందుగా ప్రశాంత్ నీల్ సినిమా అనుకున్నా కూడా దాని కోసం కూడా ఓ ఏడాది వెయిట్ చేయాలి. ఆ తరువాత బాలీవుడ్ వార్ సీక్వెల్ అని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటి నుంచి చూసుకున్నా ఏడాదికి ఒకటి, రెండేళ్లకు ఒకటి అన్నట్లు వుంది ప్లానింగ్. ఇలా అయితే రాబోయే అయిదేళ్లలో మహా అయితే మూడు సినిమాలు చేస్తారు అన్నమాట ప్రభాస్. ఇలా అయితే ఫ్యాన్స్ కు అంత హుషారుగా వుంటుందా? అన్నది అనుమానం. ఎంత భారీ సినిమాలు అయినా, పాన్ ఇండియా సినిమాలు అయినా చకచకా ఏడాదికి ఒకటయినా తమ హీరో సినిమాలు కళ్ల ముందుకు రాకపోతే ఫ్యాన్స్ ఫీలవ్వరా?