రీమేక్ కథల్ని నమ్ముకొని విజయాలు సొంతం చేసుకొన్నాడు ప్రభుదేవా. ఇక్కడి కథల్ని బాలీవుడ్‌లో తర్జుమా చేసి… కాలర్ ఎగరేశాడు. సొంత ఆలోచనలు బొత్తిగా లేవని, కాపీ పేస్ట్ దర్శకుడని కూడా విమర్శలను ఎదుర్కొన్నాడు. కథలే కాదు, ఇప్పుడు టైటిళ్లు కూడా కాపీ కొడుతున్నాడు.
ప్రభుదేవా దర్శకత్వం వహించిన తాజా చిత్రం యాక్షన్ జాక్సన్. అజయ్‌దేవగన్ కథానాయకుడు. అయితే ఈ టైటిల్ విషయంలో వివాదం నెలకొంది. ఆ టైటిల్‌పై సర్వహక్కులూ తమ దగ్గరే ఉన్నాయని ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రభుదేవాకు నోటీసులు జారీ చేసింది. దాంతో అయోమయంలో పడ్డాడీ దర్శకుడు.
ఇది వరకూ ఇంతే. రాంబో రాజ్‌కుమార్ పేరుపై ఇలాంటి వివాదమే ఎదురైతే.. చివరకు ఆ సినిమా పేరు ఆర్. రాజకుమార్‌గా మార్చాడు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ఎ. జాక్సన్ అని మారుస్తాడేమో..? అయినా ఇన్ని పేర్లు ఉండగా ఇంకా.. టైటిళ్ల దగ్గర కూడా ఈ కక్కుర్తి ఏమిటో అర్థం కాదు. ప్రభుదేవా ఇప్పటికైనా మారాలి. లేదంటే కాపీ ముద్ర అలానే ఉండిపోతుంది.