పైసా రిజల్ట్ తేలిపోయింది. ఇన్నాళ్ల వాయిదాల ఫలితం, చిత్రబృందం పడిన కష్టం ఇవన్నీ అక్కరకు రాకుండా పోయాయి. సినిమాపై ముందు నుంచీ ఎవరికీ నమ్మకాల్లేవు. సినిమా విడుదల ఆలస్యమవుతున్నప్పుడు ఓ చేయి వేసి లాగేద్దామని బెల్లంకొండ సురేష్‌లాంటి నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ.. వాళ్లు కూడా సినిమా చూసి మెల్లగా జారుకొన్నారు. వాళ్ల భయం నిజమైంది.
అయితే ఈమాత్రం సినిమాకి కృష్ణవంశీ ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాడన్నదే ఎవరికీ అంతుపట్టడం లేదు. నాని తప్ప గొప్ప స్టార్‌కాస్టింగ్ ఎవ్వరూ లేరు. టెక్నికల్ టీమ్‌లో అంతా చిన్నవాళ్లే. వీళ్లందరితో సినిమా తీయడనాకి కృష్ణవంశీ రూ.14 కోట్లకు పైనే ఖర్చు పెట్టేశాడు. కెమెరా పనితనం అద్భుతంగా ఉంది, లొకేషన్లు అదిరిపోయాయి అనడానిక వీల్లేదు. కొన్ని సీన్లు బ్లూమాట్లోలాగించేశాడు కృష్ణవంశీ.
ఇదే కథని చిన్న బడ్జెట్లో తీయొచ్చు. రూ.5 కోట్లలో లాగించేస్తే – ఇప్పటికి నిర్మాత లాభాల్లో ఉండేవాడు. కానీ అడ్డంగా కోట్లు పోసి.. ఈ సినిమాకి భారీ కలరింగు ఇచ్చారు. చివరికి ఏమైంది..? ఈ సినిమా క్లైమాక్స్‌లో జరిగినట్టే.. నిర్మాత డబ్బులు తలగబడిపోయాయి.