హాస్యనటుల సుపుత్రులు తెరపై హీరోలుగా రావడం, కొద్ది కాలంలోనే వచ్చిన దారిలోనే తిరుగుటపా కట్టడం సెంటిమెంట్‌గా మారింది. బ్రహ్మానందం తనయుడు కథానాయకుడిగా నిలదొక్కుకోవడానికి నానా పాట్లు పడుతున్నాడు. ఎమ్మెస్ నారాయణ తనయుడు విక్రమ్ కొడుకుగా వచ్చాడు. ఆ సినిమా భారీగా బోర్లా పడింది. ఆ తరవాత అబ్బాయి గారి జాడలేదు.
ఇప్పడు ఎమ్మెస్ కుమార్తె శశికిరణ్ నారాయణ ఏకంగా దర్శకురాలిగా మారింది. ఓ సినిమా మొదలెట్టింది. దాదాపు ఓ షెడ్యూల్ కూడా పూర్తయిపోయిందట. తనయుడిని ఓ హీరోగా చూడాలనుకొన్న ఎమ్మెస్ కలలు ఫలించలేదు. కనీసం కుమార్తె అయినా రాణిస్తుందా?? తన తండ్రి పేరు నిలబెడుతుందా?? అన్నది ఆసక్తికరం.
కొడుకును ప్రమోట్ చేసుకోవడానికి బ్రహ్మీ… ప్రమోషన్లు భారీగా చేస్తున్నాడు. మరి ఎమ్మెస్ కూడా అదే బాట పడతాడా? తన కూమార్తె సినిమాకి ప్రచారం కల్పించుకొంటాడా?? అయినా ఇంతకీ దర్శకత్వం అంటే బోలెడు మోజున్న ఎమ్మెస్ తెరవెనుక నుంచి కుమార్తె దర్శకత్వ వ్యవహారాలను ఎడా పెడా కెలికేయడు కదా?