Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రగ్య ను లాక్కొచ్చారు

ప్రగ్య ను లాక్కొచ్చారు

ఎఫ్ 3 సినిమా షూట్ సగంలో వుంది. కరోనా కారణంగా ఆగింది కానీ లేదూ అంటే ఇప్టటికే రెడీ అయిపోతూ వుండేది. 

ఎఫ్ 2లో వున్న తమన్నా, మెహరీన్ లకు తోడుగా ఓ కీలక పాత్రకు అంజలిని కూడా తీసుకున్నారని గతంలోనే వెల్లడించాం. అంతకు మించి ఈ సినిమాకు యాడింగ్ లు ఫ్యాడింగ్ లు జరగలేదు.

కానీ వున్నట్లుండి ఎఫ్ 3 లోకి ప్రగ్య జైస్వాల్ ను లాక్కొచ్చారు. ఆమె స్పెషల్ సాంగ్ చేస్తోంది అంటూ వార్తలు పుట్టించేసారు. కానీ నిజానికి ప్రగ్యకు ఈ సినిమాకు ఏలాంటి సంబంధమూ లేదు. 

ఏదైతే ప్రగ్య జైస్వాల్ చేస్తోంది అంటూ కథలు అల్లుతున్నారో నిజానికి ఆ పాత్ర చేస్తున్నది అంజలి. ఆ స్పెషల్ సాంగ్ కూడా అంజలి మీదే.

మైసూర్ లో ఒక లెంగ్తీ షెడ్యూలు చేయాల్సి వుంది. అది పూర్తయితే సినిమా ఓ కొలిక్కి వచ్చేస్తుంది. అనిల్ రావిపూడి చాలా సవాల్ గా అందిస్తున్న ఈ సీక్వెల్ కు దిల్ రాజు నిర్మాత. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?