Advertisement

Advertisement


Home > Movies - Movie News

మా ఎన్నికల బరిలో మంచు విష్ణు!

మా ఎన్నికల బరిలో మంచు విష్ణు!

తెలుగు సినిమా నటీనటుల సంఘం 'మా' లో మళ్లీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈసారి బరిలో హీరో మంచు విష్ణు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ బరిలోకి దిగేసారు. అయితే మంచు విష్ణు దిగుతున్నట్లు ఇంకా బయటకు రాలేదు.

ముంచు విష్ణు బరిలోకి దిగితే ప్రకాష్ రాజ్ కు మద్దతు ఎలా వుంటుందన్నది చూడాలి. ఎందుకంటే ఎంతయినా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్. విష్ణు లోకల్. అందువల్ల ఇండస్ట్రీ దాదాపుగా విష్ణు వైపే వుండే అవకాశం వుంది.

సిట్టింగ్ ప్రెసిడెంట్ నరేష్ మద్దతు విష్ణుకే అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. అయితే ప్రకాష్ రాజ్ ఓ అడుగు ముందులో వున్నారు. ఆయన అప్పుడే ఛానెళ్లలో లైవ్ ప్రోగ్రామ్ లు ఇస్తూ ప్రచారం మొదలు పెట్టేసారు.

మంచు విష్ణు నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి వుంది. మెగాస్టార్ ను కలిసి మాట్లాడిన తరువాత అనౌన్స్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?