నిజ జీవితంలో ప్రకాష్ రాజ్ కు ఎన్నేళ్లు అన్న సంగతి పక్కన పెడితే గోవిందుడు అందరివాడేలే సినిమాలో ఆయన క్యారెక్టర్ కు ఎన్నేళ్లు? సినిమాలో డాక్టర్ అంటాడు..'మరో పాతిక వేసుకోవచ్చు..ఏ సమస్యా లేదు..సెంచరీ గ్యారంటీ'…అని. అంటే అప్పటికి 75 ఏళ్లు అనుకోవాలా?
లేదా..పాతికేళ్ల కొడుకు అమెరికా వెళ్తాడు..పాతికేళ్ల మనవడు తిరిగి వస్తాడు. అంటే వెంటనే మనవుడు పుట్టి వున్నా యాభై ఏళ్లు. దానికి ప్రకాష్ రాజ్ పిల్లాడ్ని కన్న వయస్సు కనీసం లో కనీసం 20 అనుకున్నా..70ఏళ్లు వుండాలి.
కానీ, సినిమా చివరిలో మూడు పెళ్లిళ్లు..అంటే, మూడోది నా షష్టిపూర్తి పెళ్లి అంటాడు. అంటే 60 అనుకోవాలి.
ఇంతకీ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ అసలు వయస్సు ఎంత?