నిర్మాత ఫైనల్ పేమెంట్ ఇవ్వకుంటే ఏక్టర్లకు మిగిలిన ఆఖరి ఆప్షన్ తన వర్క్ ఎంతో కొంత పెండింగ్ లో వుంచడం. అగ్రిమెంట్ ప్రకారం అనుకున్న పేమెంట్ అందకపోతే నటులు చేయగలిగింది ఇదే. అయితే ఇలా చేయడం అందరు నటులకు సాధ్యం కాదు. హీరోలు, కీలక నటులు మాత్రమే ఇలా చేయగలరు. గతంలో ఓసారి ఎన్టీఆర్ ఇలాగే డబ్బింగ్ ఆపేసారు.
ఇప్పుడు మళ్లీ మరోసారి అలాంటి సిట్యువేషన్ ఓ సినిమాకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సునీల్-క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో ముస్తాబైన సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెప్పడం ఆపినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు హీరో సునీల్ టెన్ పర్సంట్ డబ్బింగ్ ను ఆపు చేసినట్లు వార్తలు వినవచ్చాయి. దీనికి ప్రకాష్ రాజ్ కూడా తోడయినట్లు వినికిడి.
ఉంగరాలరాంబాబు సేల్ ప్రారంభమైంది. మరి సేల్ పూర్తయితే, పేమెంట్లు పూర్తయి, డబ్ఫింగ్ లు ఫినిష్ అవుతాయేమో? కానీ సునీల్ ఈ నెల 15న బయల్దేరి టూ కంట్రీస్ షూటింగ్ కోసం అమెరికా వెళ్తున్నారు. ఆ లోగా డబ్బింగ్ ఫినిష్ కాకపోతే, సినిమా విడుదలకు బ్రేక్ పడే అవకాశం వుంది. ఈ సినిమాను ఈ నెల 30న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.