యముడిపై మళ్లీ మరో సినిమా

యముడు, యమలోకం బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సినిమాలు తీసినా, మన జనాలకు బోర్ కొట్టదు. ఎటొచ్చీ కాస్త వైవిధ్యంగా తీయాలంతే. ఎన్టీఆర్ దగ్గర నుంచి అల్లరి నరేష్ నుంచి ఆలీ వరకు అందరూ…

యముడు, యమలోకం బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సినిమాలు తీసినా, మన జనాలకు బోర్ కొట్టదు. ఎటొచ్చీ కాస్త వైవిధ్యంగా తీయాలంతే. ఎన్టీఆర్ దగ్గర నుంచి అల్లరి నరేష్ నుంచి ఆలీ వరకు అందరూ ఈ జోనర్ ను ట్రయ్ చేసిన వారే. అందుకే ఈ సబ్జెక్ట్ ను మరోసారి టచ్ చేయాలనుకుంటున్నారట.

ఇంతకీ ఈ సారి ట్రయ్ చేసే నటుడు ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, సబ్జెక్ట్ రెడీ చేసింది ఎవరో కాదు డైరక్టర్ శ్రీనివాస రెడ్డి. గతంలో చక్కగా చిన్న చిన్న కామెడీ సినిమాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్న ఇతగాడు, ఒక్కసారిగా నాగార్జునతో ఢమరుకం సినిమాచేసాడు. అది కాస్తే తన్నేసింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం మళ్లీ సినిమా పడలేదు.

ఇప్పుడు ఈ యమలోకపు సెమీ ఫాంటసీ కథ తయారు చేసి, సరైన హీరో కోసం వెదుకుతున్నాడట శ్రీనివాసరెడ్డి. మంచి దర్శకుడే ఢమరుకం లాంటి సోషియా ఫాంటసీ చేసి దెబ్బతిన్నాడు. మళ్లీ తన స్టయిల్ కామెడీ చేయకుండా, మళ్లీ సోషియో ఫాంటసీ నే తలకెత్తుకునే ప్రయత్నం ఎందుకో? అలవాటైపోయిన ప్రాణం ఏమో?