ప్రెగ్నెన్సీ వచ్చె మొదలాడు?

కొన్ని సినిమాల జాతకం కాస్త తేడాగా వుంటుంది.  ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ఆసియన్ సునీల్, శరత్ మరార్ నిర్మించే ' ది ఘోస్ట్ ' సంగతే ఇది. ఈ సినిమా ఇలా ప్రారంభం…

కొన్ని సినిమాల జాతకం కాస్త తేడాగా వుంటుంది.  ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ఆసియన్ సునీల్, శరత్ మరార్ నిర్మించే ' ది ఘోస్ట్ ' సంగతే ఇది. ఈ సినిమా ఇలా ప్రారంభం చేసుకుని అలా ఆగింది. 

నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫట్ మనడమే అందుకు కారణం. దాంతో యాక్షన్ పార్ట్ తగ్గించి, ఫ్యామిలీ టచ్ ఇవ్వడం కోసం రైటర్ అబ్బూరి రవిని రంగంలొకి దింపారు. 

అక్కడికి అంతా సెట్ అయింది అనుకుంటే బంగార్రాజు సినిమా లైన్ లోకి వచ్చింది. ది ఘోస్ట్ సినిమా ఓ షెడ్యూలు చేసి ఆపారు. బంగార్రాజు మొదలు పెట్టారు. ఇలాంటి టైమ్ లో హీరోయిన్ కాజల్ గర్భవతి అన్న వార్తలు బయటకు వచ్చాయి. ఇదే నిజమైతే ది ఘోస్ట్ సినిమాకు హీరోయిన్ ను మార్చుకోవాల్సి వస్తుంది.

డిసెంబర్ తరువాత ప్రారంభం కావాల్సి వుంది. కాజల్ ప్రెగ్నన్సీ వార్త నిజమైతే అప్పటకి సినిమాను స్టార్ట్ చేయాలంటే హీరోయిన్ ను మార్చుకోవాల్సిందే. సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం అంత వీజీ కాదు. మరి ఏం చేస్తారో చూడాలి.