‘ప్రేమమ్’ కు డేట్ సమస్య?

సెప్టెంబర్ 9న రావాలన్నది ప్రేమమ్ సినిమా సంకల్పం. అయితే ఈ డేట్ కు రావాలా? వద్దా? అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. కారణం దాని ముందువారం విడుదలవుతున్న జనతా గ్యారేజ్. ఆ సినిమా టాక్…

సెప్టెంబర్ 9న రావాలన్నది ప్రేమమ్ సినిమా సంకల్పం. అయితే ఈ డేట్ కు రావాలా? వద్దా? అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. కారణం దాని ముందువారం విడుదలవుతున్న జనతా గ్యారేజ్. ఆ సినిమా టాక్ ను బట్టి 9న రావాలా లేదా 16కు వెళ్లాలా అన్నది డిసైడ్ చేస్తారు. అంతవరకు కాస్త అనిశ్చితే. 

అయితే ప్రేమమ్ సోలోగా బరిలో దిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. 9న సునీల్-వీరు పోట్ల వీడు గోల్డ్ ఎహె విడుదల అన్నది ఫిక్సయిపోయింది. 16 నాని సినిమా మజ్ఞ రుమాలు వేసేసింది. 23న గోపీచంద్ ఆక్సిజన్ విడుదల అంటున్నారు. అయితే ఈ సినిమాకు కొన్ని సమస్యలు వున్నాయని వినికిడి. 30న రామ్ హైపర్ సినిమా డేట్ ఫిక్స్ చేసుకుంది. 

అందువల్ల 9 నుంచి సెప్టెంబర్ లో ఏ డేట్ కు వెళ్లినా సినిమా వుంది. కానీ మిగిలిన డేట్లు కన్నా 16తోనే ఇబ్బంది. ఎందుకంటే మజ్ఞు, ప్రేమమ్ ఇంచుమించు ఒకటే తరహా సినిమాలు. పైగా నాని సినిమా అంటే ఓవర్ సీస్ లో చైతన్య సినిమా కన్నా క్రేజ్ వుంటుంది. అందువల్ల ప్రేమమ్ 9న వచ్చేయడమే బెటరేమో?