cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

పాపం ప్రియ: మొన్న సహనటి.. ఈసారి దర్శకుడు

పాపం ప్రియ: మొన్న సహనటి.. ఈసారి దర్శకుడు

ఒక్కసారిగా సంపాదించుకున్న క్రేజ్ ను క్రమక్రమంగా పోగొట్టుకుంటోంది ప్రియా వారియర్. మొన్నటికి మొన్న ఆమె సహనటి ప్రియా వారియర్ పై దుమ్మెత్తిపోసింది. ఆమెకు కళ్లు నెత్తికెక్కాయని, గౌరవం ఇవ్వడం రాదని ఆరోపించింది. ఇప్పుడు ఏకంగా ఆ సినిమా దర్శకుడే ప్రియా వారియర్ పై ఫైర్ అవ్వడంతో ఆమె కెరీర్ డైలమాలో పడింది.

ఒరు అడార్ లవ్ సినిమాలో ప్రియా వారియర్ కన్నుగీటే సన్నివేశం ఉంది. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రియా వారియర్ కు క్రేజ్ వచ్చింది. దీంతో ఆ సినిమాలో మార్పులు చేయాలని, ప్రియాకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించాలని దర్శకుడు ఒమర్ లులుపై ఒత్తిడి పెరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో కథలు మార్పులు చేయాల్సి వచ్చింది.

అలా మార్పులు చేయడం వల్లనే ఒరు అడార్ లవ్ సినిమా ఫ్లాప్ అయిందంటున్నాడు దర్శకుడు. పైగా ఒక్కసారిగా వచ్చిన క్రేజ్ తో ప్రియా వారియర్ తనను లెక్కచేయలేదని, ఓ డైరక్టర్ కు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఆరోపించాడు. ప్రియా కంటే ఆ సినిమాలో నటించిన మరో హీరోయిన్ నూరిన్ మంచి నటి అంటూ మెచ్చుకున్నాడు ఒమర్.

స్వయంగా తన సినిమా దర్శకుడే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంలో ప్రియా వారియర్ కెరీర్ డైలమాలో పడింది. ఇప్పటికే మలయాళంలో ఆమె 2 అవకాశాలు మిస్ చేసుకుంది. తెలుగులో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ అప్పట్లో వదులుకుంది. ఇప్పుడు ఆమెకు అరకొరగా కూడా అవకాశాలు రావట్లేదు.

హద్దు లేకుండా తెగించిన రాజకీయం!

మెగా మద్ధతు వెనుక మర్మం బయటపెట్టిన నరేష్