ప్రేమకథాచిత్రమ్ ఓ ట్రెండ్ సెట్టర్. ఆరేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా, ఆ తరువాత, తరువాత ఆ హర్రర్ ఎంటర్ టైన్ మెంట్ అనే కొత్త జోనర్ ను క్రియేట్ చేసి, ఎన్నో సినిమాలకు దారి చూపించింది. ఆ తరువాత ఆ సినిమా దర్శకుడు మారుతి వేరే జోనర్ ల వైపు వెళ్లిపోయారు. దాంతో ప్రేమకథాచిత్రమ్ అలా వుండిపోయింది.
ఇన్నాళ్లకు ఆ సినిమా నిర్మాత సుదర్శనరెడ్డి దానికి సీక్వెల్ తీసే ప్రయత్నం స్టార్ట్ చేసారు. ఆర్ పి ఎ క్రియేషన్స్ పతాకంపై సుమంత్ అశ్విన్, నందిత శ్వేత ప్రధాన పాత్రలతో సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఏప్రియల్ నెలలో విడుదల చేయబోతున్నారు.
అందులో భాగంగా టీజర్ ను విడుదల చేసారు. చాలా హర్రర్ మూవీస్ మాదిరిగానే, అలాగే ప్రేమకథాచిత్రమ్ మాదిరిగానే ఓ మాంచి లవ్ స్టోరీ కి హర్రర్ జోనర్ ను జోడించినట్లు కనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. టీజర్ కట్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగున్నాయి. అయితే ఈ జోనర్ సినిమాలు ఇప్పటికే చాలా వచ్చేసాయి. అది ఒక్కటే సమస్య ఈ సినిమాకు. టీజర్ లో అంతా చూపించలేరు కానీ, సినిమాలో కాస్తయినా నావల్ పాయింట్ వుంటే సుమంత్ అశ్విన్ కు ఓ హిట్ దొరుకుతుంది.