గ్యాంగ్ లీడర్ పై రచ్చ.. అసలు తప్పెవరిది?

నిఖిల్ ఇలా ముద్ర సినిమా టైటిల్ ప్రకటించిన వెంటనే నట్టికుమార్ ఫైర్ అయ్యారు. తను రిజిస్టర్ చేయించిన టైటిల్ ను ఎలా వాడుతారంటూ నిఖిల్ ను నానా మాటలన్నారు. న్యాయం నట్టికుమార్ వైపే ఉంది,…

నిఖిల్ ఇలా ముద్ర సినిమా టైటిల్ ప్రకటించిన వెంటనే నట్టికుమార్ ఫైర్ అయ్యారు. తను రిజిస్టర్ చేయించిన టైటిల్ ను ఎలా వాడుతారంటూ నిఖిల్ ను నానా మాటలన్నారు. న్యాయం నట్టికుమార్ వైపే ఉంది, పైగా నిఖిల్ సినిమా కంటే ముందే ముద్ర విడుదలైంది. కాబట్టి నిఖిల్ తగ్గక తప్పలేదు. తన సినిమాకు పేరు మార్చుకున్నాడు. ఇప్పుడిలాంటి వివాదమే గ్యాంగ్ లీడర్ రూపంలో మొదలైంది.

నాని-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ ఫిక్స్ చేసిన వెంటనే మెగా అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నెట్ లో నానిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. చిరంజీవి కెరీర్ లో కల్ట్ మూవీగా నిలిచిన ఆ సినిమా టైటిల్ ను వాడడానికి ఎన్ని గుండెలంటూ నెటిజన్లు తిట్లదండకం అందుకున్నారు. కానీ మేకర్స్ తగ్గలేదు. గ్యాంగ్ లీడర్ టైటిల్ కే ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ పై అసలైన రచ్చ మొదలైంది.

గ్యాంగ్ లీడర్ టైటిల్ తనదే అంటున్నాడు నిర్మాత మోహన్ కృష్ణ. మాణిక్యం మూవీస్ బ్యానర్ పై 6 నెలల కిందటే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించామని, త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామని ప్రకటించాడు. తమ టైటిల్ ను కొట్టేసి ప్రచారం పొందుతున్న మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై కేసు వేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మేకర్స్ దారికిరాని పక్షంలో నాని సినిమా కంటే ముందు తమ గ్యాంగ్ లీడర్ ను రిలీజ్ చేస్తామంటున్నారు. ఈ మేరకు ఉగాది నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి, ఆగస్ట్ లో సినిమాను విడుదల చేస్తామని అంటున్నారు.

ఇక్కడ కూడా సదరు నిర్మాత, నెట్ లో ట్రోలింగ్ చేసిన మెగాభిమానుల వైపే ఉన్నాడు. అవసరమైతే తమ టైటిల్ ను మెగా కాంపౌండ్ కు చెందిన హీరోలకు ఇవ్వడానికి తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని, మెగాహీరోలు ఎవరైనా తనను సంప్రదిస్తే ఆ టైటిల్ ను వదులుకోవడానికి ఎప్పుడూ సిద్ధమేనని అంటున్నాడు మోహన్ కృష్ణ. కానీ మైత్రీ మూవీమేకర్స్ కి మాత్రం తన టైటిల్ ఇచ్చేదిలేదని తెగేసి చెబుతున్నారు.

6 నెలల కిందటే తను రిజిస్టర్ చేయించానని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు చూపిస్తున్నాడు సదరు నిర్మాత. దీంతో తప్పెక్కడ జరుగుతుందో ఈజీగానే అర్థంచేసుకోవచ్చు. అసలు తప్పు ఫిలింఛాంబర్ లో జరుగుతోంది. ఎవరి పేరు మీద ఏ టైటిల్ ఉందనే విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా.. అడిగిన వాళ్లకు అడిగిన టైటిల్ ను ఇష్టమొచ్చినట్టు ఇచ్చేస్తోంది ఫిలింఛాంబర్. ఈ విషయంలో వాళ్లు చిన్న, పెద్ద నిర్మాతల మధ్య తేడాల్ని స్పష్టంగా చూపిస్తున్నారు.

పెద్ద నిర్మాతలు వచ్చి అడిగితే చిన్న నిర్మాతల టైటిల్ ను వాళ్లకు ఇచ్చేస్తున్నారు. ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చనే నిర్లక్ష్య ధోరణి ఛాంబర్ లో కనిపిస్తోంది. పెద్ద చిన్న తేడాలేకుండా ఏ నిర్మాత వచ్చి టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం అడిగినా, ముందుగా ఆ టైటిల్ ఎవరి పేరిట ఉందో చెక్ చేసుకుంటే ఈ సమస్య వచ్చేదే కాదు. ఒకవేళ అలా చెక్ చేసి చెప్పినప్పటికీ, మైత్రీ మూవీమేకర్స్ గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయిస్తే మాత్రం కచ్చితంగా తప్పు మైత్రీ నిర్మాతలదే అవుతుంది. 

వంగవీటికే భయపడలేదు.. టీడీపీకి జంకుతానా.. వర్మ ధైర్యం