చండీ శుక్రవారం విడుదలై ప్రేక్షకుల్ని చీల్చి చండాడుతోంది. ఈ సినిమాపై అటు ప్రియమణి, ఇటు సముద్ర భారీ ఆశలు పెంచుకొన్నారు. ఈ సినిమాతో అనుష్క రేంజు కథానాయిక అయిపోవాలని ప్రియమణి కలలుకంది.
ప్రియమని టాలెంట్‌పై నమ్మకం ఉంచిన నిర్మాతలు ఆమెకు లక్షకుల సమర్పించుకొన్నారు. ఈ సినిమా కోసం ప్రియమణి తన కెరీర్లో ఎప్పుడూ లేనంత పారితోషికం అందుకొందట. దాదాపు రూ80 లక్షలు ముట్టిందని తెలిసింది. సాధారణంగా ప్రియమణి పారితోషికం 20 లక్షల లోపే.
అంటే నాలుగు సినిమాల రేటు ఈ చండీతో గిట్టుబాటు అయ్యిందన్నమాట. నిర్మాతలకు ఎంత పోయినా… ప్రియమణికి మాత్రం బాగానే గిట్టుబాటు అయ్యింది. అందుకనేనేమో..? లేడీ ఓరియెంటెడ్ పాత్రలంటే తెగ ముచ్చటపడిపోతోంది..?