పుకార్లు ఎక్కువ.. సినిమాలు తక్కువ!

టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా మారింది ప్రియాంక జవాల్కర్. అది విడుదలైన తర్వాతే మిగతా సినిమాలు ఒప్పుకోవాలనే కాన్సెప్ట్ తో దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉండిపోయింది. టాక్సీవాలా విడుదలైంది. ప్రాఫిటబుల్ వెంచర్ అనిపించుకుంది. కానీ…

టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా మారింది ప్రియాంక జవాల్కర్. అది విడుదలైన తర్వాతే మిగతా సినిమాలు ఒప్పుకోవాలనే కాన్సెప్ట్ తో దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉండిపోయింది. టాక్సీవాలా విడుదలైంది. ప్రాఫిటబుల్ వెంచర్ అనిపించుకుంది. కానీ ప్రియాంక మాత్రం హిట్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది.

క్రెడిట్ అంతా విజయ్ దేవరకొండ కొట్టేయడంతో, ప్రియాంక వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. దీనికితోడు వరుసగా వస్తున్న గాసిప్స్ ఈమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈమె కెరీర్ కు సంబంధించి పుకార్లు ఎక్కువ, సినిమాలు తక్కువ అయిపోయాయి.

టాక్సీవాలా రిలీజైన వెంటనే రవితేజ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడంటూ ప్రియాంకపై పుకార్లు వచ్చాయి. కట్ చేస్తే డిస్కో రాజా నటీనటుల జాబితాలో ప్రియాంక జవాల్కర్ లేదు. ఆ తర్వాత గోపీచంద్, నాగచైతన్య సినిమాల్లో కూడా ఈమెను హీరోయిన్ గా తీసుకోబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఆ సినిమాలకు కూడా వేరే హీరోయిన్లను పెట్టుకున్నారు.

ఇక రీసెంట్ గా అఖిల్ సరసన ప్రియాంక అంటూ కొత్తగా కథనాలు వినిపించాయి. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ చేయబోయే సినిమాలో ప్రియాంక జవాల్కర్ ను హీరోయిన్ గా తీసుకున్నారంటూ స్టోరీలు వినిపించాయి. కానీ అలాంటిదేం లేదని తేలిపోయింది.

ఇలా టాక్సీవాలా తర్వాత పూర్తిగా పుకార్లకే పరిమితమైపోయింది ప్రియాంక కెరీర్. అఫీషియల్ గా ఒక్క సినిమా కూడా లేదు. ఆమె ఎప్పుడు, ఎవరి సినిమాతో సెట్స్ పైకి వస్తుందో ఎవరికీ తెలియదు. 

పవన్‌ తీరే కారణమా? అందుకే నేతలు పట్టించుకోవడం లేదు!

బాలకృష్ణ ఓవరాక్షన్ ను భరించలేం