cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

రాజ్ తరుణ్ పై 'తొలిప్రేమ' ఎఫెక్ట్!

రాజ్ తరుణ్ పై 'తొలిప్రేమ' ఎఫెక్ట్!

కుమారి 21ఎఫ్ కాంబినేషన్ మళ్లీ కలవనుందని, త్వరలోనే రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ పైకి రానుందనే విషయం తెలిసిందే. కాకపోతే ఇప్పుడీ ప్రాజెక్టులో భారీ మార్పు చోటుచేసుకోనుంది. ఏకంగా హీరోను రీప్లేస్ చేసే ఆలోచనలో ఉన్నారు.

అవును.. రాజ్ తరుణ్ స్థానంలో లేటెస్ట్ సెన్సేషన్ వరుణ్ తేజ్ ను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నాడు నిర్మాత రామ్ తాళ్లూరి. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కంటే వరుణ్ తేజ్ అయితే బెస్ట్ అని భావిస్తున్నాడట. ఈ మేరకు వరుణ్ తో సంప్రదింపులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. 

కుమారి 21ఎఫ్ తరహాలోనే కాస్త బోల్డ్ కంటెంట్ తో కథ రాసుకున్నాడు సూర్య ప్రతాప్. ఇప్పటి జనరేషన్ కు సరిగ్గా సూట్ అయ్యే రొమాంటిక్ స్టోరీ అది. సో.. ఇలాంటి కథలో ఫిదా, తొలిప్రేమ లాంటి విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. 

అటు నిర్మాత కూడా రాజ్ తరుణ్ కంటే వరుణ్ తేజ్ అయితే తన సినిమాకు మార్కెట్ బాగుంటుందని భావిస్తున్నాడు. ప్రస్తుతం సెన్సిబుల్ కథల్నే అంగీకరిస్తున్న వరుణ్ తేజ్, సూర్యప్రతాప్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది చూడాలి.