Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నటితో నిర్మాత అనుబంధ వివాదం?

నటితో నిర్మాత అనుబంధ వివాదం?

ఎలాంటి వారైనా సినిమా రంగంలోకి వచ్చాక దేనికో దానికి అలవాటు పడిపోతారు. అది మందు పార్టీలైనా కావచ్చు, పేకాటలయినా కావచ్చు. ఇక అమ్మాయిలతో అనుబంధాలు అయినా కావచ్చు. మరీ ఈ మూడింటికీ దూరంగా వున్నవాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టేసుకోవచ్చు.

అలాగే అందరూ కాదు కానీ కొందరు అమ్మాయిలు చాలా తెలివిగా వుంటారు. ఏ సీజన్ కు ఆ సీజన్ ఎవరో ఒకర్ని ఆకర్షించి, తమ వెంట తిప్పుకుని, ఈ రంగంలో మేనేజ్ అయిపోతూ వుంటారు. ఇటు వీక్ నెస్, అటు అట్రాక్షన్.. అన్నీ కలిస్తే ఇంకేముంది.. అయితే ఫుల్ జల్సా.. చాలా మంది తెలివిగా వుంటారు. అవకాశం, డబ్బు తప్ప, శాశ్వత అనుబంధాల వైపు వెళ్లరు. కొందరు మాత్రం ఈ వగలు, హొయలు, నిజం అనుకుని వలలో పడుతుంటారు.

ఆయనో ఎన్నారై నిర్మాత. కాస్త డబ్బులు వున్నాయి. డబ్బులు వచ్చాయి. దాంతో రెండు రకాలుగా మారారు. ఒకటి ఎదురెళ్లి అడ్వాన్స్ లు ఇవ్వడం. ఇదేమీ పెద్ద ఇబ్బంది కాదు. సరైన అడ్వాన్స్ లు ఎప్పటికైనా పనికి వచ్చేవే. రెండోది ఓ నటితో కాస్త చనువు ఎక్కువ పెట్టుకోవడం. ఈ రెండింటి వల్ల కుటుంబంలో కాస్త కలతలు నెలకొన్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. డబ్బులు వేస్ట్ చేస్తున్నారని, అనవసరంగా అడ్వాన్స్ ల రూపంలో జల్లేస్తున్నారని భార్య బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు తెలుసున్న పెద్ద మనుషుల దగ్గరకు విషయం వెళ్లడం, వాళ్లు సర్దిచెప్పడం జరిగిందని తెలుస్తోంది. నిజానికి ఆ నిర్మాతను చూస్తే ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకునే మాదిరిగా కనిపించరు. అందుకే ఈ గ్యాసిప్స్ వినిపించిన ఇండస్ట్రీ జనాలు నమ్మలేకపోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?