పీఆర్వోలూ… నో ఫొటోస్ ప్లీజ్

ఓ సినిమా ప్రారంభమైంది అంటే ఆ యూనిట్ పీఆర్వోలు అడపాదడపా ఫొటోలు పంపడం కామన్. అవి పత్రికల్లో, వివిధ మాధ్యమాల్లో దర్శనమిస్తాయి. దానివల్ల సినిమా జనాలకు వీలయినంత చేరువ అవుతుంది. అవే ఫొటోలను ఫ్యాన్స్…

ఓ సినిమా ప్రారంభమైంది అంటే ఆ యూనిట్ పీఆర్వోలు అడపాదడపా ఫొటోలు పంపడం కామన్. అవి పత్రికల్లో, వివిధ మాధ్యమాల్లో దర్శనమిస్తాయి. దానివల్ల సినిమా జనాలకు వీలయినంత చేరువ అవుతుంది. అవే ఫొటోలను ఫ్యాన్స్ కూడా వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ల మీద షేర్ చేస్తుంటారు. ఇదంతా కామన్ గా జరిగే ప్రక్రియ. అయితే ఇక మీద పీఆర్వోల పంపే ఫొటోలు వాడడానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఫొటోలు ఎందుకు వాడారు అంటూ కొన్ని డిజిటల్ మాధ్యమాలకు ఆ సినిమా యూనిట్ నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా డిజిటల్ మాధ్యమాల్లో ఫొటోలు వాడడం అన్నది కామన్. ఇప్పటివరకు ఇలాంటి వైనం ఎప్పుడూ ఎదురుకాలేదు ఎవ్వరికి.

పైగా ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి భంగిమ వన్.. భంగిమ టూ అంటూ దర్శకుడు క్రిష్ ఆయన పీఆర్ యూనిట్ తామరతంపరగా ఫొటోలు వదిలాయి. వాళ్లే ఫొటోలు పంపించి, మళ్లీ ఇప్పుడు సినిమా యూనిట్ నే ఎందుకు వాడారు? అంటూ నోటీసులు ఇవ్వడం చిత్రంగా వుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇవన్నీ బాలయ్యకు తెలిసి జరిగే పనులు కావని, కొందరు బాలయ్య దగ్గర చేరి, ఆయన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య దగ్గర అనుచరులు లేదా ఆయన అనునాయులు ఇప్పుడు ఒకటి రెండువర్గాలుగా మారినట్లు తెలుస్తోంది. ఒకవర్గం చేస్తున్న ఈ పనులు రెండోవర్గానికి అంతగా రుచించకున్నా, బాలయ్యను దృష్టిలో పెట్టుకుని మౌనంగా వుండిపోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు వాడారు అంటూ డిజిటల్ మీడియాలు కొన్నింటికి నోటీసులు ఇచ్చారని తెలిసి, ఈ వర్గం ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటోంది. ఇప్పుడు దీని ప్రభావం రాబోయే బాలయ్య సినిమాల మీద కచ్చితంగా వుంటుందని, ఫొటోలు వాడకుండా ప్రచారం ఎలా సాధ్యం అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ను ఇరికించారా? ఇరుక్కున్నారా?

రాయలసీమ వరకూ జనసేన చర్చలోనే లేదు…