పబ్లిక్ డిమాండ్ : పాత్రలు మార్చాలట

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది మహానటి ప్రాజెక్టు. ఈ సినిమా కోసం ఇప్పటికే కీర్తిసురేష్, సమంతను తీసుకున్నారు. వీళ్లలో కీర్తిసురేష్ లీడ్ రోల్ పోషించనుంది. జర్నలిస్ట్ పాత్రకు సమంత…

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది మహానటి ప్రాజెక్టు. ఈ సినిమా కోసం ఇప్పటికే కీర్తిసురేష్, సమంతను తీసుకున్నారు. వీళ్లలో కీర్తిసురేష్ లీడ్ రోల్ పోషించనుంది. జర్నలిస్ట్ పాత్రకు సమంత ఎంపికైంది. సమంత కోణంలోనే సావిత్రి బయోపిక్ ను ప్రజెంట్ చేస్తారట. ఇప్పుడీ సినిమాలోకి అనుష్కను కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. కీలకమైన జమున పాత్రకు అనుష్కను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో పాత్రలు మార్చాలనే చర్చ మొదలైంది. 

కీర్తి సురేష్ విషయంలో ఎలాంటి కామెంట్స్ లేవు. ఎందుకంటే తెలుగు జనాలకు ఆమె 2 సినిమాల పరిచయం మాత్రమే. ఎటొచ్చి సమంత, అనుష్క విషయంలోనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. సమంతకు జర్నలిస్ట్, అనుష్కకు జమున పాత్రలు ఇవ్వడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. జమున పాత్రను సమంతకు ఇస్తే  బాగుంటుందని అంటున్నారు చాలామంది. 

అనుష్కను జర్నలిస్ట్ గా చూపించి, ఆమె పాత్ర ద్వారా సావిత్రి కథను చూపించాలని.. సమంతను మాత్రం జమున పాత్రకు ఎంపిక చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో ఇంకో కీలకపాత్ర కోసం ప్రకాష్ రాజ్ ను సెలక్ట్ చేశారు. సావిత్రి భర్త జెమినీ గణేశన్ క్యారెక్టర్ ను ప్రకాష్ రాజ్ పోషించనున్నారు. ఈ ఎంపికకు మాత్రం సోషల్ మీడియాలో నూటికి నూరుమార్కులు పడ్డాయి. జెమినీ గణేశన్ పాత్రకు ప్రకాష్ రాజ్ నూటికి నూరుశాతం న్యాయం చేస్తారని అంతా అంగీకరించారు. జూన్ నుంచి మహానటి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.