Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పులితో ఎన్టీఆర్ ఫైట్?

పులితో ఎన్టీఆర్ ఫైట్?

సీనియర్ ఎన్టీఆర్ ను టైగర్ అని కూడా అనేవారు ముద్దుగా టాలీవుడ్ లో. నటసింహం అంటారు బాలకృష్ణను. యంగ్ టైగర్ అనే పేరు వుంది జూనియర్ ఎన్టీఆర్ కు. అడవిరాముడులో సీనియర్ ఎన్టీఆర్ సింహంతో ఫైట్ చేసారు. యమదొంగ సినిమాలో రాజమౌళి జూనియర్ చేత 'వేటాడేస్తది' అంటూ జూలు విదిలించినట్లు మూవ్ మెంట్ ఇప్పించి డైలాగ్ చెప్పించారు. నందమూరి ఫ్యామిలీ హీరోలకు సింహాలు, పులులతో వున్న నేపథ్యం ఇది.

బహుశా ఇది అంతా దృష్టిలో వుంచుకునే కావచ్చు. ఆర్.ఆర్.ఆర్ లో కూడా ఓ పులి ఫైట్ పెట్టినట్లు తెలుస్తోంది. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి-కొమరం పాత్రలు అడవిలో వుండే రోజుల్లో పులితో ఫైట్ చేసే సీన్ ఒకటి క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ మాంచి ఫైట్ ను విజువలైజ్ చేసి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బల్గేరియాలో వుంది ఆర్.ఆర్.ఆర్ టీమ్. అక్కడే ఈ ఫైట్ ను పిక్చరైజ్ చేస్తున్నట్లు, దీనికి విదేశీ నిపుణుల టీమ్ పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ గురించి రకరకాల వార్తలు వినిపించడం ఇటీవల కామన్ అయింది. వాటిల్లో ఇదీ ఒకటా? కాదా? అన్నది తెలియాల్సి వుంది.

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?