బిగ్ బాస్ హౌజ్ లో రాహుల్-పునర్నవి మధ్య సాన్నిహిత్యాన్ని అంతా చూశాం. రాహుల్ ఎలిమినేట్ అయితే పునర్నవి ఎంత బాధపడిందో చూశాం. పునర్నవి ఎలిమినేట్ అయితే రాహుల్ ఎంత ఏడ్చాడో కూడా చూశాం. వీళ్లిద్దరి మధ్య హౌజ్ మేట్స్ కు మించి మరేదో గాఢమైన బంధం ఉందని ప్రేక్షకులంతా ఫిక్స్ అయిపోయారు. హౌజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఎట్టకేలకు రాహుల్ తో తనుకున్న రిలేషన్ షిప్ పై స్పందించింది పునర్నవి.
రాహుల్ ను కేవలం తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటోంది పునర్నవి. రాహుల్ బయటకొచ్చిన తర్వాత కూడా అతడితో ఫ్రెండ్లీగానే ఉంటానంటోంది. ఒకవేళ రాహుల్ కనుక తనకు లవ్ ప్రపోజ్ చేస్తే, వాడికి చుక్కలు చూపించడం గ్యారెంటీ అంటోంది.
“రాహుల్, నేను మంచి ఫ్రెండ్స్ మాత్రమే. అంతకు మించి మరేంలేదు. నేను వాడ్ని ఎంతతిట్టినా నాతోనే ఉంటాడు. వాడు మంచోడు. అందుకే వాడికి నేను చాలా ఛాన్సులు ఇచ్చాను. రాత్రిళ్లు అయినా మేం మాట్లాడుకునే వాళ్లం. మా ఇద్దరి మధ్య అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత కూడా మేం ఫ్రెండ్స్ గానే ఉండాలని అనుకుంటున్నాను. ఒకవేళ బయటకొచ్చిన తర్వాత రాహుల్ కనుక నాకు ప్రపోజ్ చేస్తే, ఇవన్నీ అవసరమా అని అడుగుతాను. పొమ్మంటాను. కానీ నిజంగా వాడు నాకు లవర్ అయితే మాత్రం నరకమే. ఫ్రెండ్ గా ఉంటేనే చుక్కలు చూపించాను, ఇక లవర్ అయితే నరకం చూపిస్తాను.”
బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న 50 రోజుల్లో తను బాధపడిన అంశం ఒకేఒక్కటిగా చెప్పుకొచ్చింది పున్నూ. రాహుల్ ఎలిమినేట్ అయినప్పుడు మాత్రమే చాలా బాధపడ్డాడనని, మిగతావన్నీ హ్యాపీ మూమెంట్స్ అని చెప్పుకొచ్చింది. తన వల్లే రాహుల్, బయటకు వెళ్లిపోయాడనే గిల్టీ ఫీలింగ్ తనకు ఇప్పటికీ ఉందంటోంది పునర్నవి.
“మొత్తం బిగ్ బాస్ జర్నీలో బాధాకరమైన అంశం ఒక్కటే. రాహుల్ నా వల్లే ఎలిమినేట్ అయ్యాడు. నాకోసం త్యాగంచేసి హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయాడనే ఆ గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది. నేను, రాహుల్, వితిక, వరుణ్ చాలా క్లోజ్ గా ఉండే వాళ్లం. మా నుంచి ఎవరు బయటకు వెళ్లినా అందరికీ బాధ ఉంటుంది. కానీ నా వల్ల రాహుల్ బయటకు వెళ్లిపోయాడనే ఆలోచనను నేను తట్టుకోలేకపోయాను. అందుకే బాగా ఏడ్చాను.”
బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకొచ్చినప్పటికీ ఆ షోకు దూరంగా జరగడం లేదు పునర్నవి. రాహుల్ కు ఓటేసి, అతడ్ని గెలిపించాలని అందర్నీ కోరుతోంది. బిగ్ బాస్ షో ముగిసేవరకు రాహుల్, వరుణ్ కు మద్దతుగా తన ప్రచారం సాగుతుందని స్పష్టంచేసింది.