Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి 'ఏ' సినిమా తీస్తారా?

పూరి 'ఏ' సినిమా తీస్తారా?

ఇదే మాట మీడియాలో వస్తే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గతంలో బోలెడు కోపం వచ్చింది. కానీ తరువాత తరువాత ఆయనే యూ ట్యూబ్ లో అలాంటి సినిమాలు చేయాలని ప్రయత్నాలు సాగించారు. 

పూరి జగన్నాధ్. ఆర్జీవీకి శిష్యుడే కాదు. దాదాపు అదే బాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. శివ, రంగీలా, సర్కార్ లాంటి సినిమాల నుంచి ఐస్ క్రీమ్, శ్రీదేవి లాంటి సినిమాలకు దిగిపోయారు. పూరి కూడా పోకిరి, బిజినెస్ మెన్  లాంటి సినిమాల నుంచి జ్యోతిలక్ష్మి, లోఫర్ లాంటి సినిమాలకు వచ్చేసారు. పెద్ద హీరోలు ఎవరూ దాదాపుగా పూరికి డేట్లు ఇస్తారా అన్నది అనుమానమే. 

అయితే పూరి ఆలోచన వేరుగా వుందని వినికిడి. ఈ పెద్ద హీరోల డేట్లు ఎవరికి కావాలి అనే ధోరణిలో ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. మాంచి ఏ సర్టిఫికెట్ సినిమా తీస్తా అని ఆయన సన్నిహితులతో అన్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. అంటే పూరి కూడా సరైన సినిమా చేతిలో లేకపోతే రామ్ గోపాల్ వర్మ మాదిరిగా ఇలాంటి ఆలోచనలు సాగిస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతుంది. 

నిజానికి ఆర్జీవీ అయినా, పూరి అయినా, మనసుపెట్టి, పద్దతిగా పనిచేస్తే, అద్భుతమైన సినిమాలు చేయగల టాలెంట్ వున్నవారే. కానీ ఎందుకో వారు ఏదో మూడ్ లో, ఏదో ఆలోచన చేసి, మరేదో చేస్తూ, కెరీర్ గ్రాఫ్ ను పాడుచేసుకుంటున్నారు అనిపిస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?