Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి సినిమాకు గిరాకీల్లేవా?

పూరి సినిమాకు గిరాకీల్లేవా?

నాన్న పులి కథ తెలిసిందేగా? ఒకసారి ఓకె. రెండు సార్లు ఓకె. కానీ పదే పదే అదే అంటే జనం పట్టించుకోవడం మానేస్తారు. పూరి జగన్నాధ్ సినిమాల పరిస్థితి ఇలాగే వుంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే గురువు రామ్ గోపాల్ వర్మ సినిమాల మాదిరిగానే వుంటున్నాయి. వర్మ ఎక్కడో మొదలు పెట్టి, ఆఖరికి ముక్కు మొహం తెలియని హీరోల వరకు వచ్చి, ఇక చాల్లే అనకుని ముంబాయికి వెళ్లిపోయాడు. ఇప్పుడు పూరి కూడా దాదాపు అదే దారిలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మహేష్ లాంటి స్టార్ ల నుంచి, నాగ శౌర్య లాంటి చోటా హీరోల వరకు వచ్చేసాడు.

ఇధిలా వుంటే ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా తయారవుతున్న ఇజమ్ సినిమా పూర్తి కావచ్చింది. ఇకనైనా సేల్ మొదలు కావాలి. కానీ అంతగా ఎంక్వయిరీలు రావడం లేదని వినికిడి. టెంపర్ కు ముందు రెండు మూడు ఫ్లాపులు, టెంపర్ తరువాత రెండు మూడు ప్లాపులు ఇచ్చాడు పూరి. టెంపర్ కూడా మంచి ప్రాజెక్టే కానీ, ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అయితే కాదు. ఆ సంగతి నిర్మాత బండ్లకి బాగా తెలుసు.

ఇక కళ్యాణ్ రామ్ పటాస్ తరువాత చేస్తున్న సినిమా ఇది. ఆ విజయం కాస్త ఊపు నివ్వాలి. కానీ పూరి డైరక్టర్ కావడంతో బయ్యర్లు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమా మీద కాస్త ఆసక్తి పెంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ ఇమేజ్ బయటకు వచ్చింది. మరి దీన్ని చూసి బయ్యర్లు ఏమైనా ఆసక్తి పుంచుకంటారా? ఏమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?