పూరి సినిమాలో విజయ్ పాత్రకు…?

ఈ జనరేషన్ హీరోలు వైవిధ్యమైన పాత్రలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ తన జైలవకుశ సినిమాలో కాస్త నత్తి వున్న పాత్ర చేసాడు. అలాగే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చెవిటివాడి పాత్ర చేసాడు. రవితేజ…

ఈ జనరేషన్ హీరోలు వైవిధ్యమైన పాత్రలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ తన జైలవకుశ సినిమాలో కాస్త నత్తి వున్న పాత్ర చేసాడు. అలాగే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చెవిటివాడి పాత్ర చేసాడు. రవితేజ ఏకంగా అంధుడి పాత్రను చేసాడు. ఇప్పుడు ఇదే బాటలోకి హీరో విజయ్ దేవరకొండ కూడా అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికి వున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ ఓ డిఫరెంట్ లైన్ ను విజయ్ దేవరకొండకు చెప్పాడు. ఆ లైన్ ప్రకారం సినిమాలో హీరో పాత్రకు లైట్ గా నత్తి వుంటుంది. ఆ నత్తితో చెప్పే డైలాగుల చివర చిన్న ఫన్ తొంగిచూస్తుంది. ఈ లైన్ తో కూడిన కథను పూరి చెప్పినట్లు, దానికి విజయ్ ఓకె అన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ లైన్ తో వున్న పాత్రతో కూడిన కథకు స్క్రిప్ట్ వర్క్ జరగాలి. అది విజయ్ ఓకె చేయాలి. ఇలా చాలా వుంది వ్యవహారం. అయితే పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు కేవలం ఓ సమస్యను పాత్రకు పెట్టి హీరోని ఒప్పించాడని అనుకోలేం. దానికి ఇంకా అదనపు విశేషం, దాంతో పుట్టే ఫన్ అంతా ఏదో వుండే వుంటుంది.

ఎందుకంటే పూరి సీరియస్ ఎమోషన్ సినిమా అయితే తీయరు. పక్కా మాస్ అండ్ ఫన్ సినిమానే తీస్తారు. సో.. అందువల్ల  విజయ్ తో పూరి ఈ నత్తి సమస్యతో ఎలా ఫన్ పండించే స్క్రిప్ట్ తయారు చేస్తారో చూడాలి.

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది