Advertisement

Advertisement


Home > Movies - Movie News

ద్విభాషా చిత్రం.. అమలాపాల్ వెరైటీ ప్రచారం

ద్విభాషా చిత్రం.. అమలాపాల్ వెరైటీ ప్రచారం

ఒక సినిమాను 2-3 భాషల్లో తెరకెక్కించడం కామన్. ఆ విషయాన్ని ప్రెస్ నోట్లలో, ప్రెస్ మీట్స్ లో ప్రకటిస్తుంటారు మేకర్స్. కానీ అమలా పాల్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించింది. ద్విభాషా చిత్రం కాబట్టి రెండు ఓపెనింగ్స్ ఉంటే బాగుంటుందని భావించింది. అనుకున్నదే తడవుగా అమల్లో పెట్టింది.

తొలిసారిగా నిర్మాతగా మారి ఓ సినిమాకు శ్రీకారం చుట్టింది అమలాపాల్. తెలుగు, తమిళ భాషల్లో అనూప్ దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి రెడీ అయింది. దీనికోసం ఆమె ఓపెనింగ్ నుంచే కొత్త పంథాను అనుసరించింది. తమిళ్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించడంతో పాటు.. తెలుగులో కూడా ఈ సినిమాను ప్రారంభించింది. ఫిలింనగర్ దైవసన్నిధానంలో అమలాపాల్ కొత్త సినిమా ప్రారంభమైంది. ఇలా ఒక సినిమాకు రెండు ఓపెనింగ్స్ ఇచ్చి డిఫరెంట్ గా ముహూర్తం షాట్ నుంచే ప్రచారం ప్రారంభించింది అమలాపాల్.

ఫోరెన్సిక్ పరీక్షల నేపథ్యంలో, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది. చెన్నైలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నారట. ఇందులో ఫోరెన్సిక్ డాక్టర్ గా అమలాపాల్ కనిపించనుంది. ఈ పాత్ర కోసం 3 నెలలు కష్టపడ్డానంటోందామె.

ఈ సినిమాలో అమలాపాల్ సరసన అరుణ్ ఆదిత్ హీరోగా నటిస్తున్నాడు. 3 నెలల్లో సినిమాను పూర్తిచేసి థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. సో.. అమలాపాల్ నిర్మాతగా క్లిక్ అవుతుందా అవ్వదా అనే విషయం ఈ ఏడాదిలోనే తేలిపోతుందన్నమాట. 

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?