Advertisement

Advertisement


Home > Politics - Gossip

మాజీ జేడీ ఆక్రోశం : ‘వాళ్లంతా మూర్ఖులు’

మాజీ జేడీ ఆక్రోశం : ‘వాళ్లంతా మూర్ఖులు’

మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ఆయన పార్టీ మారుతున్నట్లుగా విస్తృతండగా ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఆయన ఆ ప్రచారాలను ఖండించారు. తిప్పికొట్టారు. ఇలాంటి ప్రచారం  ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగించిందిట. ఆయన షాక్‌కు గురయ్యారట. ఈ సంగతులను కూడా ఆయన ట్విటర్ వేదికలో వెల్లడించారు.

నిజానికి పవన్ కల్యాణ్ పార్టీతో మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సిద్ధాంతసారూప్యత, భావజాలం కలిసిపోవడం లాంటి మూలాల్లో బలం ఏమీలేదు. సీబీఐ ఉద్యోగానికి రాజీనామా చేసేసిన తర్వాత.. ఆయన చాలాకాలంగా సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనతోనే ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే... ఆయన రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సమావేశాలు, అభిప్రాయ సేకరణ వంటి కార్యక్రమాలతో.. తనకు తాను రాష్ట్రస్థాయి నేతగా ఒక హోదాను నిర్మించుకునే ప్రయత్నం చేశారు. తాను రాష్ట్రస్థాయి నేతను అని తానే గుర్తించుకున్నారు.

తీరా ఎన్నికల పర్వం వచ్చేసరికి ఆయన దానికి తగ్గంతగా గేరప్ కాలేదు. పైగా రాజకీయాల్లో వాస్తవాలు ఎలా ఉంటాయో తెలిశాయి. తెదేపాలోకి వెళ్లలేక, లోకసత్తాతో కూడా సంప్రదింపులు జరిగిన తర్వాత, సొంత పార్టీ ఆలోచనను అటకెక్కించి.. జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ ఆయనకు చాలా గౌరవంగా విశాఖ లోక్ సభ సీటు కట్టబెట్టారు. కానీ ఓటమి తప్పలేదు.

జేడీ అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉండిపోగా, పవన్ కూడా ఆయనను పక్కన పెట్టినట్టే వ్యవహరించారు. ఈ పరిణామాలపై గ్రేటాంధ్ర ఇదివరకే ఓ కథనం అందించింది కూడా. ఆయన పార్టీని వీడుతున్నట్టుగా ప్రచారం ముమ్మరం కావడంతో.. ఆయన స్పందించి ఇవాళ ట్విటర్ తన ఆగ్రహం వెళ్లగక్కారు. పార్టీ మారను అంటూనే.. చాలా లౌక్యంగా తన స్థాయి చెప్పుకోవడం విశేషం.

‘తన అవసరం పార్టీకి ఉందని, తన అవసరం ఉన్నట్లుగా పవన్ భావించే వరకు పార్టీలో ఉంటానని’ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ‘గిట్టనివాళ్లు వదంతులు సృష్టిస్తారు.. మూర్ఖులు ప్రచారంచేస్తారు’ అనడం విశేషం. ఇలాంటి మాటలను పవన్ ఎంతమేరకు సహిస్తారో... ఆయన ఎంతకాలం జనసేన ముద్రతో ఉండగలరో వేచిచూడాలి. 

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?