Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి 'ఇజం'లో పవనిజం ఎంతో మరి.!

పూరి 'ఇజం'లో పవనిజం ఎంతో మరి.!

పూరి జగన్నాథ్‌కి పవన్‌కళ్యాణ్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం. తాను రాసుకున్న చాలా కథలు పవన్‌కళ్యాణ్‌ కోసమే పుట్టాయంటాడు పూరి జగన్నాథ్‌. పూరి సినిమాల్లో హీరో పాత్ర తాలూకు బాడీ లాంగ్వేజ్‌ అచ్చంగా పవన్‌కళ్యాణ్‌ కోసమే అన్నట్లుంటుంది. ఏ కథ రాసినా, రాయాలనుకున్నా ముందుగా తనకు పవన్‌కళ్యాణే మదిలో మెదులుతాడని చాలా ఓపెన్‌గా చాలా సందర్భాల్లో పూరి చెప్పిన విషయం విదితమే. 

ఇక, పూరి తన తాజా చిత్రానికి 'ఇజం' అని పేరు పెట్టేశాడు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంతవరకు 'ఇజం' అన్న పదానికి పేటెంట్‌ హక్కు పవన్‌కళ్యాణ్‌కే వెళ్ళిపోయింది. ఎందుకంటే, ఆయన అభిమానులు 'పవనిజం'లో మునిగి తేలుతుంటారు. పవన్‌కళ్యాణ్‌ మీద తమకున్న అభిమానానికి వారు పేరు పెట్టుకున్న పేరు అది. అదో మతం.. అంటారు అందులో మునిగిపోయిన అభిమానులు. 

మరి, పూరి తెరకెక్కిస్తున్న 'ఇజం' టైటిల్‌ వెనుక అసలు ఉద్దేశ్యమేంటి.? పవనిజంపై 'ఇజం'లో పూరి జగన్నాథ్‌ ఏమైనా కామెంట్లు వేస్తాడా.? ఈ ప్రశ్నలిప్పుడు సినీ వర్గాల్లో హాట్‌ హాట్‌ చర్చకు తెరలేపాయి. పూరి సినిమాల్లో హీరో రెక్లెస్‌గా వుంటాడు. ఎడా పెడా సెటైర్లు వేసేస్తాడు. 'హార్ట్‌ఎటాక్‌' సినిమాలో పూరి, సరదాగానే అయినా పవన్‌ మీద సెటైర్లు వేయించేశాడు. మరి, 'ఇజం', పవనిజంని వెటకారం చేస్తుందా.? ఎలివేట్‌ చేస్తుందా.? ఈ టైటిల్‌తో పూరి, పవన్‌ అభిమానుల్ని కెలికాడనుకోవాలా.? వేచి చూడాల్సిందే.

కొసమెరుపు: తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి - మెగా కుటుంబాల మధ్య పోటీ వుంది. అభిమానుల మధ్య పోటీ ప్లస్ వైరం కూడా వుంది. మరి, నందమూరి హీరోతో పూరి జగన్నాథ్ చూపించబోయే ‘ఇజం’ ఎలాంటి వివాదాలకూ తావీయదు కదా.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?