Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి 'ఇజం' వెనుక పవన్‌.?

పూరి 'ఇజం' వెనుక పవన్‌.?

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'ఇజం' సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమాలో హీరో కళ్యాణ్‌రామ్‌ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నాడు. జర్నలిస్ట్‌ అనగానే పూరి సినిమాల్లో 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమానే గుర్తుకొస్తుంది. ఇందులో పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన విషయం విదితమే. అప్పట్లో 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'పై భారీ అంచనాలే నెలకొన్నా, సినిమా అనేక వివాదాల నడుమ, అంచనాల్ని అందుకోలేకపోయింది. 

ఇక, ఇప్పుడు పూరి మరోమారు జర్నలిజం గురించీ, మీడియా గురించీ 'ఇజం'తో క్లాసులు పీకుతాడనగానే, సినిమా ఎలాంటి వివాదాలకు తావిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ కన్పిస్తోంది. అప్పట్లో, పవనిజంని, జర్నలిజంనీ మిక్స్‌ చేయాలనుకుని బోల్తా కొట్టేసిన పూరి, ఈసారి ఏం చేస్తాడన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఆ సినిమా ఔట్‌ పుట్‌ సరిగ్గా రాకపోవడంతో, అదే జర్నలిజం చుట్టూ కొత్తగా కథని అల్లి, పూరి ఈ 'ఇజం'ని తెరకెక్కించాడన్న ప్రచారం జరుగుతోంది. 

అయితే, 'ఇజం' స్టిల్స్‌ చూస్తోంటే, ఇదేదో పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ అనిపించకమానదు. సిక్స్‌ ప్యాక్‌లో కళ్యాణ్‌రామ్‌ రగ్‌డ్‌ లుక్‌తో కనిపిస్తున్నాడు. 'ఇతను జర్నలిస్ట్‌ ఏంటి.?' అని ఆశ్చర్యపోయేలా వున్నాడు 'ఇజం'లో కళ్యాణ్‌రామ్‌. మరి, పూరి 'ఇజం' ఎలా వుండబోతోంది.? జర్నలిజం నేపథ్యంలోనే 'ఇజం' అన్నది పక్కాయేనా.? వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?